CM రేవంత్ పాలనపై కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు

సీఎం రేవంత్ రెడ్డి పాలనలో కేవలం రెండు రకాల పర్యాటకాలు మాత్రమే కొనసాగుతున్నాయని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR ) అన్నారు

Update: 2024-12-16 11:29 GMT

దిశ, వెబ్‌డెస్క్: సీఎం రేవంత్ రెడ్డి పాలనలో కేవలం రెండు రకాల పర్యాటకాలు మాత్రమే కొనసాగుతున్నాయని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR ) అన్నారు. సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) ఢిల్లీ పర్యాటకం, ప్రజలను జైలులో పెట్టడం మాత్రమే చేస్తున్నాడని అన్నారు. సోమవారం అసెంబ్లీ సమావేశాల అనంతరం తెలంగాణ భవన్‌లో (Telangana Bhavan) మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఘాటు వ్యాఖ్యలు చేశారు. సీఎం రేవంత్ రెడ్డి పర్యాటకం పేరుతో ఢిల్లీకి 100 సార్లు పోయినా 100 పైసలు కూడా తెలంగాణకు తేలేదని అన్నారు. ఇది దద్దమ్మ ప్రభుత్వం అంటూ మండిపడ్డారు. ఎక్కే విమానం, దిగే విమానం అంటూ తీవ్ర విమర్శలు చేశారు. కాంగ్రెస్ (Congress) ప్రభుత్వానికి చేతగాని పాలనపై ఎవరైనా ఎదురు మాట్లాడితే జైలులో పెడుతూ నియంత పాలనను అవలంభిస్తున్నాడని కేటీఆర్ ఆరోపించారు.

Tags:    

Similar News