Ponguleti: నా కోరిక అలాగే పెండింగ్‌లో ఉండిపోతోంది.. మంత్రి పొంగులేటి ఆసక్తికర వ్యాఖ్యలు

తెలంగాణలో రియల్ ఎస్టేట్ రంగం(Real estate sector) పడిపోలేదని మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి(Ponguleti Srinivasa Reddy) స్పష్టం చేశారు.

Update: 2024-12-16 11:07 GMT

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణలో రియల్ ఎస్టేట్ రంగం(Real estate sector) పడిపోలేదని మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి(Ponguleti Srinivasa Reddy) స్పష్టం చేశారు. సోమవారం అసెంబ్లీ ఆవరణలో మీడియా ప్రతినిధులతో చిట్‌చాట్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆంధ్రప్రదేశ్‌లో చంద్రబాబు నాయుడు(Chandrababu Naidu) ప్రభుత్వం రాగానే.. పరిశ్రమలు అక్కడికి తరలి వెళుతున్నాయనే ప్రచారం అవాస్తవం అని కొట్టిపారేశారు. అమరావతిలో వరద వల్ల ఏపీకి పెట్టుబడులు వెళ్లే పరిస్థితి లేదని.. అక్కడ పెట్టుబడి పెట్టడానికి ఇన్వెస్టర్లు భయపడుతున్నారని కీలక వ్యాఖ్యలు చేశారు. హైడ్రా(Hydra) భయం ప్రజల్లో మాత్రం లేదు.. మొదట్లో తప్పుడు ప్రచారం జరిగినా ఇప్పుడు నిజం తెలిసిందని అన్నారు.

అప్పులపై కేటీఆర్(KTR) నిజాలు తెలుసుకుని మాట్లాడాలని హితవు పలికారు. కార్పొరేషన్ లోన్స్‌(Corporation Loans)తో కలిపి మొత్తం లెక్కలు బీఆర్ఎస్(BRS) నేతలు బయటపెట్టాలని డిమాండ్ చేశారు. కార్పొరేషన్ పేరుతో చేసే అప్పులు సైతం ప్రభుత్వం ఖాతాలోకి వస్తాయనే విషయం కేటీఆర్ తెలుసుకోవాలని ఎద్దేవా చేశారు. 7 లక్షల 20 వేల కోట్లు తెలంగాణ రాష్ట్రానికి అప్పులు ఉన్నాయి. ఇదంతా బీఆర్ఎస్ హయాంలో జరిగిన వ్యవహారం అని అన్నారు. శాసన సభలో ఎవరి పాత్ర వారిదే.. ప్రివిలేజ్ మోషన్(Privilege Motion) ఇవ్వడం వాళ్ల హక్కు అని తెలిపారు. కేసీఆర్(KCR) అసెంబ్లీకి వస్తే ఆయనతో కూర్చొని మాట్లాడాలనే కోరిక నాకు వ్యక్తిగతంగా ఉందని మంత్రి పొంగులేటి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్‌(Stamps and Registration Department)లో ఆదాయం పెరుగుతుందని అన్నారు. కాంగ్రెస్ ఏడాది కాలంపై ఎలాంటి వ్యతిరేకత లేదు.. వైఎస్ఆర్(YSR) సమయంలో కూడా ఇలానే ప్రచారం జరిగిందని గుర్తుచేశారు. రెండు మూడు ఏళ్ళల్లో అన్ని సర్దుకుంటాయని తెలిపారు. రాష్ట్రంలో వర్షాలు కూడా ఈసారి బాగానే పడ్డాయని అన్నారు. అదానీ(Adani) విషయంలో కాంగ్రెస్ పార్టీ జాతీయ పాలసీనే రాష్ట్రంలో అమలు చేస్తున్నదని స్పష్టం చేశారు.

Tags:    

Similar News