నగరంలో శ్మశాన వాటికల కొరత ఉంది : కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి

హైదరాబాద్ నగరంలో స్మశాన వాటికల కొరత తీవ్రంగా ఉందని ఉన్నవాటిలో మౌలిక సదుపాయాలు కల్పించి, ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని జిహెచ్ఎంసి అధికారులను కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి డిమాండ్ చేశారు.

Update: 2025-03-22 15:23 GMT
నగరంలో శ్మశాన వాటికల కొరత ఉంది   : కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి
  • whatsapp icon

దిశ,రాంనగర్ : హైదరాబాద్ నగరంలో స్మశాన వాటికల కొరత తీవ్రంగా ఉందని ఉన్నవాటిలో మౌలిక సదుపాయాలు కల్పించి, ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని జిహెచ్ఎంసి అధికారులను కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి డిమాండ్ చేశారు. ముషీరాబాద్ నియోజకవర్గంలోని నాగమయ్యకుంట, అరుంధతి నగర్ ప్రాంతాల్లో సివరేజ్ లైన్, నూతన మంచినీటి పైప్ లైన్, సీసీ రోడ్డు, చేపట్టే నిర్మాణ పనులను కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, రాజ్యసభ సభ్యులు కె.లక్ష్మణ్, ముషీరాబాద్ నియోజకవర్గ ఎమ్మెల్యే ముఠా గోపాల్ కలిసి ప్రారంభించారు. అదేవిధంగా బాపూజీ నగర్ లో గల హిందూ శ్మశాన వాటికలో 32 లక్షలతో చేపట్టిన అభివృద్ధి పనులను ముషీరాబాద్ కార్పొరేటర్ సుప్రియ నవీన్ గౌడ్ తో కలిసి ప్రారంభించారు.

అనంతరం ఆయన మాట్లాడుతూ… హైదరాబాద్ నగరంలో ఉన్నటువంటి శ్మశాన వాటికల పై ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసి ప్రత్యేక కార్యాచరణ రూపొందించి అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉందన్నారు. ప్రభుత్వం వెంటనే నిధులు కేటాయించాలని డిమాండ్ చేశారు. శ్మశాన వాటికల కొరతల వల్ల కొన్ని చోట్ల స్థానిక ప్రజల మధ్య ఘర్షణలు సైతం జరుగుతున్నాయని పేర్కొన్నారు. ఎందుకంటే రాష్ట్రంలో ఉండే జనాభాలో 30% జనాభా నగరంలోని ఉన్నారని దీన్ని పరిగణలోకి తీసుకొని శ్మశాన వాటికలను అభివృద్ధి చేసేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. జిహెచ్ఎంసి నిర్లక్ష్యం, నిధులు కేటాయించిన పోవడం వల్ల ఇబ్బందులు ఏర్పడుతున్నాయన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి హైదరాబాద్ నగరంలోని శ్మశాన వాటికలను అభివృద్ధి చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు, బిజెపి, బిఆర్ఎస్ పార్టీ నియోజకవర్గ నాయకులు ,డివిజన్ అధ్యక్షుడు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.


Similar News