కంచె గచ్చిబౌలి భూముల వేలం.. ప్రభుత్వానికి హైకోర్టు కీలక ఆదేశాలు
హైదరాబాద్ ఐటీ హబ్‌కు అతి సమీపంలో ఉన్న కంచె గచ్చిబౌలిలో 400 ఎకరాల వేలంపై కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది...

దిశ, తెలంగాణ బ్యూరో: హైదరాబాద్ ఐటీ హబ్‌కు అతి సమీపంలో ఉన్న కంచె గచ్చిబౌలిలో 400 ఎకరాల వేలంపై కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. భూముల విక్రయంపై హైకోర్టులో సోమవారం ప్రజా ప్రయోజన వాజ్యం (పిల్) దాఖలైంది. పిటిషన్ పై హైకోర్టు విచారణ చెపట్టింది. భూముల విక్రయాలకు సంబంధించి ప్రభుత్వానికి హై కోర్టు నోటీసులు జారీ చేసింది. ప్రభుత్వం ఆదాయం సమకుర్చుకునేందుకు ఎకరా రూ50కోట్ల చోప్పున విక్రయాలకు బిడ్డింగ్ ప్రక్రియ చెపట్టినట్లు పిటిషన్ లో పేర్కోన్నారు. ఈ ప్రాంతం కేబీఆర్ పార్కు కంటే నాలుగు రెట్లు పెద్దదని, పచ్చని అటవీ ప్రాంతాన్ని కలిగి ఉంటుందని జంతువులు, వివిధ రకాల పక్షులకు ఆవాసంగా ఉందని పిటిషన్‌లో పేర్కొన్నారు. ఈ అటవీ ప్రాంతంలో దాదాపు 237 రకాల పక్షులు, అరుదైన స్టార్ తాబేళ్లు, డీర్స్, వైల్డ్ బోర్స్, ఇండియన్ రాక్ పైథాన్, వైపర్స్, కోబ్రాస్, బోయాస్, క్రైట్స్ వంటి జంతువులు, సరీసృపాలు ఉన్నాయని తెలిపారు. విచారించిన హైకోర్టు ధర్మాసనం ఏప్రిల్ 7వ తేదికి విచారణ వాయిదా వేస్తున్నట్లు తెలిపింది.