AUS vs IND: వాళ్ల సోషల్ మీడియా ఆర్మీలు నన్ను ట్రోల్ చేస్తాయి.. ఎక్స్‌లో సీవీ ఆనంద్ సెటైర్లు
బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ లో భాగంగా భారత్ – ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న టెస్టు మ్యాచుల్లో టీమ్ ఇండియా పేలవ ప్రదర్శన చేస్తున్న సంగతి తెలిసిందే.
దిశ, డైనమిక్ బ్యూరో: బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ (Border Gavaskar Trophy) లో భాగంగా భారత్ – ఆస్ట్రేలియా (AUS vs IND) మధ్య జరుగుతున్న టెస్టు మ్యాచుల్లో టీమ్ ఇండియా పేలవ ప్రదర్శన చేస్తున్న సంగతి తెలిసిందే. నాలుగు టెస్టులు ఆడిన భారత్ 2-1తో వెనుకబడి ఉంది. తొలి టెస్టు తప్ప జరిగిన మ్యాచుల్లో టీమ్ ఇండియాకు నిరాశే ఎదురైంది. ముఖ్యంగా స్టార్ ఆటగాళ్లు బ్యాటింగ్‌లో విఫలవడం నెట్టింట చర్చానీయంశంగా మారింది. ఈ నేపథ్యంలోనే టీమ్ ఇండియా ప్రదర్శనపై మీ అభిప్రాయం తెలుసుకోవాలని ఉందని ఓ నెటిజన్‌లు ఎక్స్ వేదికగా హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్ (CV Anand)ను అడిగారు. దీనికి ఆయన రిప్లై ఇచ్చారు. ప్రత్యర్థి టీమ్ 11 మందితో ఆడుతుంటే భారత్ కేవలం 9 మంది ఆటగాళ్లతో ఎలా పోటీపడుతోంది.. అంటూ సీపీ సెటైర్లు వేశారు.
అగ్రశ్రేణి జట్ల చేతిలో దారుణంగా ఓడుతున్నామని, ఈ విషయాన్ని జీర్ణించుకోవడం చాలా కష్టమన్నారు. గత ఆస్ట్రేలియా పర్యటనలో స్టార్ ఆటగాళ్లు లేకుండా భారత జట్టు చాలా బాగా ఆడింది.. గెలిచిందన్నారు. ఇద్దరు అగ్రశ్రేణి ఆటగాళ్లు.. నేను పేరు పెట్టడం మానేస్తాను ఎందుకంటే వారి “సోషల్ మీడియా ఆర్మీలు” నన్ను ట్రోల్ చేస్తాయి.. స్టార్ ఆటగాళ్లంటే అవసరమైనప్పుడు మంచి ప్రదర్శన చేసి అభిమానుల్లో తమ ఆదరణ ఏమాత్రం తగ్గకుండా చూసుకోవాలని ఓ నెటిజన్‌కు సీపీ సమాధానం ఇచ్చారు.
టీమ్ ఇండియా ఎదుర్కొంటున్న పరాభవాలను చూసి నేను మౌనంగా ఉండిపోయాను.. భారత జట్టు చాలా కాలంగా కేవలం 9 మంది ఆటగాళ్లతోనే ఆడుతోంది.. క్రికెట్‌కు ఎంతో ఆదరణ ఉన్న దేశం ఈ భారాన్ని మోయడం న్యాయమా? ఆ స్టార్ ఆటగాళ్ల సోషల్ మీడియా (social media) ఆర్మీలు ఎవరైనా తమకు వ్యతిరేకంగా ఏదైనా మాట్లాడినప్పుడల్లా దాడి చేస్తాయి.. అని సీపీ సీవీ ఆనంద్ మరో నెటిజన్‌కు సీపీ సీవీ ఆనంద్ రిప్లై ఇచ్చారు.