Minister Seethakka : మహిళల ఉపాధి కల్పనకు ప్రభుత్వం చేయూత : మంత్రి సీతక్క

మహిళ(Womens)ల ఉపాధి కల్పన(Employment)కు, మహిళలు వ్యాపారాల్లో రాణించేందుకు ప్రభుత్వం చేయూత(Government Assistance)నందిస్తుందని మంత్రి సీతక్క(Minister Seethakka) తెలిపారు.

Update: 2025-01-03 06:41 GMT

దిశ, వెబ్ డెస్క్ : మహిళ(Womens)ల ఉపాధి కల్పన(Employment)కు, మహిళలు వ్యాపారాల్లో రాణించేందుకు ప్రభుత్వం చేయూత(Government Assistance)నందిస్తుందని మంత్రి సీతక్క(Minister Seethakka) తెలిపారు. సావిత్రి భాయి ఫూలే(Savitribai Phule)కు నివాళులర్పించి(Tributes)న మంత్రి సీతక్క ప్రజాభవన్ లో 25 సంచార చేపల విక్రయ వాహనాల(Mobile Fish Vending Vehicles)ను సీతక్క జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా వర్ధిల్లాలి మహిళా శక్తి అంటూ స్వయంగా సీతక్క నినాదాలు ఇచ్చారు. సంచార చేపల విక్రయ వాహనంలో ప్రయాణించి పరిశీలించారు. మహిళా సాధికారికత కోసం రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రజాప్రభుత్వం అనేక కార్యక్రమాలు అమలు చేస్తుందన్నారు. దేశంలో మొదటి సారి సావిత్రి భాయి ఫూలే జయంతిని అధికారికంగా నిర్వహిస్తున్నామని తెలిపారు. మహిళ ఇంటికే పరిమితం కాదని సావిత్రి భాయి ఫూలే నిరూపించారని, చదువు గొప్పతనాన్ని ప్రపంచానికి చాటిన గొప్ప వ్యక్తి సావిత్రి భాయి ఫూలే అని కొనియాడారు. ఆడవారికి చదువు అవసరం లేదనే మూఢనమ్మకాల నుంచి ఇప్పడిప్పుడే బయటపడ్డామన్నారు. ఇవ్వాళ దేశానికి ఆదివాసీ బిడ్డ రాష్టప్రతిగా ఉన్నారని గుర్తు చేశారు.

కాంగ్రెస్ లక్ష్యం సామాన్య మహిళలను కోటీశ్వరులను చేయడమేనన్నారు. భార్యభర్తలు రోజంతా పనిచేసినా.. సాయంత్రం భార్య మాత్రమే ఇంట్లో పని ఎందుకు చేయాలని..ఇద్దరూ చేయాల్సిందేనన్నారు. మహిళా సంఘాలకు లోన్ భీమా పథకాన్ని అమలు చేస్తున్నామని, 17 రకాల వ్యాపారాలతో మహిళలకు ఉపాధి కల్పిస్తున్నామని వెల్లడించారు. నేను కూడా రోడ్డు పక్కన చేపల విక్రయం చేశానని గుర్తు చేసుకున్నారు. నాణ్యత, మంచి రుచితో ఆరోగ్యకరమైన చేపల వంటకాలు తయారుచేయడం ద్వారా లాభసాటి వ్యాపారం చేయాలని సూచించారు.

మీ ఫిష్ ఫుడ్ కు మంచి బ్రాండ్ క్రియేట్ కావాలని..100 సక్సెస్ రేట్ ఉండాలని, అమ్మ చేతి వంటకు మారుపేరుగా ఇందిరా మహిళా క్యాంటీన్ లు ఉండాలని, సంచార చేపల విక్రయ వాహనాల్లో వ్యాపారాలు విజయవంతం కావాలని ఆకాంక్షించారు. మండల కేంద్రాల వరకు ఈ వ్యాపారం వెళ్లాలన్నారు. పది లక్షల వాహనాన్ని ఆరు లక్షల సబ్సిడీతో కేవలం నాలుగు లక్షలకే లబ్ధిదారులకు వాహనాలు అందిస్తున్నామని వాటిని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. నేను కూడా రోడ్డు పక్కన చేపల విక్రయం చేశానని గుర్తు చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో ఫిషరీస్ కార్పొరేషన్ చైర్మన్ మెట్టు సాయికుమార్, ప్రజాకవి జయరాజు, కరీంనగర్ జిల్లా గ్రంధాలయ సంస్థ చైర్మన్ సత్తు మల్లేష్, జన విజ్ఞాన వేదిక అధ్యక్షుడు రమేష్ లు పాల్గొన్నారు.

Tags:    

Similar News