R.S. Praveen Kumar: వారికి అపాయిట్మెంట్ లెటర్స్ ఎందుకివ్వరు ? : ఆర్ఎస్.ప్రవీణ్ కుమార్

తెలంగాణ జెన్ కో(Telangana Genco) ఏఈ కెమిస్ట్ ఉద్యోగాల(AE Chemist Jobs)కు ఎంపికైన అభ్యర్థులకు అపాయింట్మెంట్ లెటర్స్ (Appointment Letters)ఎందుకు ఇవ్వడం లేదని వారు తెలంగాణ ప్రాంతీయులు కాదా అని బీఆర్ఎస్ నేత, మాజీ ఐపీఎస్ ఆర్ఎస్.ప్రవీణ్ కుమార్(R.S. Praveen Kumar) ప్రభుత్వా(State Government)న్ని ఎక్స్ వేదికగా ప్రశ్నించారు.

Update: 2025-01-03 06:19 GMT

దిశ, వెబ్ డెస్క్ : తెలంగాణ జెన్ కో(Telangana Genco) ఏఈ కెమిస్ట్ ఉద్యోగాల(AE Chemist Jobs)కు ఎంపికైన అభ్యర్థులకు అపాయింట్మెంట్ లెటర్స్ (Appointment Letters)ఎందుకు ఇవ్వడం లేదని వారు తెలంగాణ ప్రాంతీయులు కాదా అని బీఆర్ఎస్ నేత, మాజీ ఐపీఎస్ ఆర్ఎస్.ప్రవీణ్ కుమార్(R.S. Praveen Kumar) ప్రభుత్వా(State Government)న్ని ఎక్స్ వేదికగా ప్రశ్నించారు. అసలు తెలంగాణ జెన్ కో సంస్థలో ఏం జరుగుతుందని, అపాయింట్మెంట్ లెటర్లు కోసం వారు ఎంతకాలం ఎదురుచూడాలని మండిపడ్డారు. టీచర్లు,స్టాఫ్ నర్సులు, డిగ్రీ కాలేజీ లెక్చరర్లు, ఫిజికల్ డైరెక్టర్లు, గ్రూప్ 4 అభ్యర్థులందరికీ నియామక పత్రాలు ఇచ్చి, వీరికి మాత్రమే ఎందుకు ఇవ్వడం లేదని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. సీఎండీ, ఇతర అధికారులేమో ప్రభుత్వం ఇవ్వాలి, మా చేతిలో ఏం లేదంటున్నారని, సంబంధిత మంత్రిని నాలుగు సార్లు కలిసినా పట్టించుకోవడం లేదని ఆర్ఎస్పీ ఆగ్రహం వ్యక్తం చేశారు.

పరీక్ష పెడుతారు, ఫలితాలు చెబుతారు, సర్టిఫికెట్ల వెరిఫికేషన్ చేస్తారు..ఒరిజినల్ సర్టిఫికెట్లు తీసుకుంటారు..ఆఖరికి బాండ్ పేపర్ కూడా రాయించుకోని రోడ్ల మీద వదిలేస్తరా? అని ప్రభుత్వ వైఖరిని దుయ్యబట్టారు. వాల్లు ఏం పాపం చేసిండ్రని ? వీళ్లు తెలంగాణ ప్రాంతీయులు కాదా? లేదంటే వీల్లు కూడా నాలుగువేల మంది సర్వ శిక్ష అభియాన్ టీచర్ల మాదిరిగా, రోడ్ల మీద టెంట్లు వేసుకొని ధర్నాలు చేయాలా? అని నిలదీశారు. ఏఈలకు అపాయింట్మెంట్ లెటర్ల ఆలస్యం వెనుక ఉన్న ఆంతర్యం ఏంటని? ఇదేనా ప్రజా ప్రభుత్వం అంటే..ఇట్లనే ఉంటే తెలంగాణ ప్రజలు మిమ్మల్ని పారదోలడం ఖాయమని ప్రవీణ్ కుమార్ హెచ్చరించారు.

Tags:    

Similar News