DGP Jitender: అంతర్జాతీయ క్రీడాకారుల్ని తయారు చేసేలా టీజీపీఎస్పీని తీర్చిదిద్దుతాం: డీజీపీ

అంతర్జాతీయ క్రీడాకారుల్ని తయారు చేసేలా టీజీపీఎస్పీని తీర్చిదిద్దుతామని డీజీపీ అన్నారు.

Update: 2025-01-03 06:57 GMT

దిశ, డైనమిక్ బ్యూరో: అంతర్జాతీయ క్రీడాకారుల్ని తయారు చేసేలా టీజీఎస్పీ (DGP Jitender)ని తీర్చిదిద్దుతామని డీజీపీ జితేందర్ అన్నారు. శుక్రవారం యూసఫ్ గూడలోని బెటాలియన్ కానిస్టేబుళ్ల పాసింగ్ అవుట్ పరేడ్ (Police Passing out Parade) నిర్వహించారు. ఇందులో 549 మంది కానిస్టేబుళ్లు పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన డీజీ జితేందర్ మాట్లాడుతూ నిఖత్ జరీన్, మహ్మద్ సిరాజ్ టీజీఎస్పీలో చేరారు. వారి సేవలను సద్వినియోగం చేసుకునేందుకు స్పెషల్ ట్రైనింగ్ సెంటర్ ఏర్పాటుకు ప్రతిపాదిస్తున్నట్లు డీజీపీ చెప్పారు. పోలీస్ ట్రైనింగ్ లో భాగంగా బాక్సింగ్, క్రికెట్ పై కూడా ప్రత్యేకంగా శిక్షణ ఇచ్చి ఇంటర్నేషనల్ స్టాండర్డ్ ఆటగాళ్లను కూడా తయారు చేయాలనుకుంటున్నామన్నారు.

Tags:    

Similar News