DSC Candidates : ప్రజా భవన్‌లో డీఎస్సీ అభ్యర్థుల ఆందోళన
తమకు ఉద్యోగ పోస్టింగ్(Postings)లు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ 2008 డీఎస్సీ అభ్యర్థు(DSC Candidates) లు ప్రజాభవన్(Praja Bhavan)ఎదుట ధర్నా(Protest)కు దిగారు.
దిశ, వెబ్ డెస్క్ : తమకు ఉద్యోగ పోస్టింగ్(Postings)లు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ 2008 డీఎస్సీ అభ్యర్థు(DSC Candidates) లు ప్రజాభవన్(Praja Bhavan)ఎదుట ధర్నా(Protest)కు దిగారు. 1399మంది అభ్యర్థులకు ఉద్యోగాలు ఇచ్చేందుకు జీవో నెంబర్ 9 తెచ్చి కేబినెట్ అప్రూవల్ చేసి కూడా సంవత్సరం గడిచిందని..అయినా తమకు ఉద్యోగాలు ఇవ్వలేదని వారు ఆందోళన వ్యక్తం చేశారు. చరిత్రలో లేని రీతిలో రెండోసారి కూడా సర్టిఫికెట్ వెరిఫికేషన్ కోసం ఒరిజినల్స్ సర్టిఫికెట్స్ తీసుకోని 4 నెలలు అవుతుందని..ఒరిజినల్స్ సర్టిఫికెట్స్ లేనందున బయట ఉద్యోగాలు కూడా చేసుకోలేకపోతున్నామని వాపోయారు.
ఇంట్లో వాళ్లపై ఆధారపడలేక ఆత్మహత్య చేసుకునే పరిస్థితి వచ్చిందని అభ్యర్థులు ఆవేదన వ్యక్తం చేశారు. సీఎం రేవంత్ రెడ్డి చొరవ తీసుకుని మాకు వెంటనే ఎస్జీటీ ఉపాధ్యాయ ఉద్యోగానికి పోస్టింగులు ఇవ్వాలని అభ్యర్థులు వేడుకున్నారు.