వచ్చే ఎన్నికల్లో వైసీపీ నుంచి పోటీ చేయను: YSRCP MLA Kotamreddy Sridhar Reddy

నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి సంచలన ప్రకటన చేశారు.

Update: 2023-02-01 05:30 GMT

దిశ, వెబ్‌డెస్క్: నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి సంచలన ప్రకటన చేశారు. వచ్చే ఎన్నికల్లో వైసీపీ నుంచి పోటీ చేయడం లేదని, టీడీపీ నుంచి పోటీ చేస్తానని ప్రకటించారు. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం తర్వాత మొదటిసారి మీడియా ముందుకు వచ్చిన ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. నమ్మకం లేని ఉండలేనని అనూహ్య వ్యాఖ్యలు చేశారు. మూడు నెలలుగా తన ఫోన్ ట్యాపింగ్ చేస్తున్నారని, ఇంటెలిజెన్స్ చీఫ్ సీతారామాంజనేయులు తనను బెదిరించే ప్రయత్నంచేశారని మీడియా ఎదుట నెంబర్ బయటపెట్టారు. అది ట్యాపింగ్ కాదని నిరూపించాలని వైసీపీ నేతలకు సవాల్ విసిరారు. తనను అనుమానించిన చోట కాపురం చేయలేనని, భవిష్యత్తు నిర్ణయం ఏంటనేది త్వరలో ప్రకటిస్తానని చెప్పారు. అన్నింటికి సిద్ధమయ్యే ఇలా మాట్లాడుతున్నానని వెల్లడించారు. ప్రభుత్వ పెద్దలే ట్యాపింగ్ చేస్తే ఎలా అని ప్రశ్నించారు. తమ ఫోన్‌లు కూడా ట్యాప్ చేస్తున్నారని 35 మంది ఎమ్మెల్యేలు, నలుగురు ఎంపీలు తనకు ఫోన్ చేసి చెప్పినట్లు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తాను దేనికైనా సిద్ధమని, వచ్చే ఎన్నికల్లో టీడీపీ నుంచి పోటీ చేస్తానని సంచలన ప్రకటన చేశారు. 

Also Read...

రెండో రోజు BRS MLC వెంకట్రామిరెడ్డి కంపెనీల్లో ఐటీ సోదాలు 

Tags:    

Similar News