Owaisi: ఎక్సైజ్ డిపార్ట్‌మెంట్‌గా పేరు మార్చాలి.. అక్బరుద్దీన్ ప్రసంగం.. సభలో నవ్వులు
తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా మంగళవారం ఆసక్తికర సన్నివేశం చోటుచేసుకుంది.

దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా మంగళవారం ఆసక్తికర సన్నివేశం చోటుచేసుకుంది. ఎంఐఎం నేత, చాంద్రాయణగుట్ట ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ (Akbaruddin Owaisi) సభలో నవ్వులు పూయించారు. అక్బరుద్దీన్ ప్రసంగం ప్రారంభించగానే గడియారం వైపు ప్యానెల్ స్పీకర్ రేవూరి ప్రకాశ్ రెడ్డి చూస్తారు. అది గ్రహించిన అక్బరుద్దీన్ మీరు టైమ్ చూస్తున్నారు.. ఎక్కువ సేపు మాట్లాడనని స్పీకర్‌ను కోరారు. వెంటనే స్పీకర్ టైమ్ రాయాలి కాదా.. అంటూ సమాధానం ఇచ్చారు. ఈ నేపథ్యంలో సభలో స్పీకర్‌తో పాటు సభ్యులు సరదాగా నవ్వారు.
అదేవిధంగా సభలో అక్బరుద్దీన్ మాట్లాడుతూ.. ఎక్సైజ్ డిపార్ట్‌మెంట్ పేరుగా మార్చాలని ప్రభుత్వాన్ని కోరారు. ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ డిపార్ట్‌మెంట్‌లో ప్రొహిబిషన్ ఎక్కడుంది? అని ప్రశ్నించారు. మద్యం విషయంలో రాష్ట్రంలో అత్యధిక రెవెన్యూ వస్తుంది.. మందు తాగుతున్నరు.. తాగిస్తున్నరు.. చిన్నా పెద్దా ఎలక్షన్ సమయంలో మద్యం వినియోగం పెరుగుతుంది, కానీ ఇందులో ప్రొహిబిషన్ ఎక్కడ ఉంది సార్.. అంటూ ప్రశ్నించారు.