తెలంగాణ ప్రభుత్వం సంచలన నిర్ణయం.. బెట్టింగ్, గేమింగ్ యాప్‌లపై విచారణకు సిట్ ఏర్పాటు
తెలంగాణ అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి గేమింగ్, బెట్టింగ్ యాప్‌లపై సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ హోమ్ శాఖ, శాంతి భద్రత, ఆన్ లైన్ బెట్టింగ్, గేమింగ్ యాప్ లపై మాజీ మంత్రి హరీష్ రావు లేవనెత్తిన అంశాలపై సీఎం రేవంత్ రెడ్డి స్పందించారు.

దిశ, వెబ్ డెస్క్: తెలంగాణ అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి గేమింగ్, బెట్టింగ్ యాప్‌ల (Gaming and betting apps)పై సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ హోమ్ శాఖ, శాంతి భద్రత, ఆన్ లైన్ బెట్టింగ్, గేమింగ్ యాప్ లపై మాజీ మంత్రి హరీష్ రావు లేవనెత్తిన అంశాలపై సీఎం రేవంత్ రెడ్డి స్పందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ ప్రభుత్వం 2021 లో ఆన్ లైన్ బెట్టింగ్, గేమింగ్ యాప్ లపై నిషేధం విధించినప్పటికీ సరైన చర్యలు తీసుకోకపోవడం వల్ల ఇటీవల రాష్ట్రంలో పలు ఘటనలు చోటు చేసుకున్నాయని అన్నారు. అలాగే రాష్ట్రంలో గత కొద్ది రోజులుగా జరుగుతున్న ఘటనలపై కాంగ్రెస్ ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తుందని చెప్పుకొచ్చారు. ఆన్ లైన్ రమ్మీ వంటి ఇతర గేమ్ లను నిరోధించడానికి, నిషేదించడానికి, చర్యలు తీసుకొవడానికి స్పేషల్ ఇన్వెష్టిగేషన్ టీమ్ (Special Investigation Team)ను ఏర్పాటు చేయాలని నిర్ణయించామని అన్నారు.
గత కొద్ది రోజులుగా ఆన్ లైన్ బెట్టింగ్ యాప్‌లను ప్రమోషన్ చేసిన వారిపై కేసులు నమోదు చేసి విచారించామని దీని వలన సమస్య తీరదు అన్నారు. ఈ బెట్టింగ్ యాప్‌లను నిర్వహిస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకొవాలంటే చాలా మందిని ఇన్వెస్టిగేషన్ చేయాల్సిన అవసరం ఉందని.. ఇందుకు ప్రభుత్వానికి అన్ని అధికారాలు కావాలని.. ఈ బెట్టింగ్ యాపులపై విచారణ చేసేందుకు స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ ను ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం నిర్ణయించిందని సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీ సాక్షిగా చెప్పుకొచ్చారు. అలాగే ఆన్లైన్ బెట్టింగ్ యాప్‌లను నిర్వహిస్తున్న వారికి విదించే శిక్షను పెంచేందుకు వచ్చే సమావేశాల్లో సవరణ బిల్లును సభలో ప్రవేశ పెడతామని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు.