CM Revanth Reddy: కాసేపట్లో హుజూర్‌నగర్‌కు సీఎం రేవంత్.. కీలక పథకానికి అంకురార్పణ
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) కాసేపట్లో సూర్యాపేట (Suryapet) జిల్లా హూజూర్‌నగర్ (Huzurnagar)కు బయలుదేరనున్నారు.

దిశ, వెబ్‌వెస్క్: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) కాసేపట్లో సూర్యాపేట (Suryapet) జిల్లా హూజూర్‌నగర్ (Huzurnagar)కు బయలుదేరనున్నారు. ఈ మేరకు ఇవాళ ఆయన తెల్లరేషన్ కార్డు (White Ration Card)పై సన్న బియ్యం పంపిణీ పథకాన్ని అధికారికంగా ప్రారంభించనున్నారు. ఇందుకు సంబంధించి సివిల్ సప్లైయ్స్ (Civil Supplies) అధికారులు ఇప్పటికే భారీ ఏర్పాట్లు చేశారు. కాసేపట్లో బేగంపేట్ ఎయిర్‌పోర్ట్ నుంచి సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy)తో కలిసి మంత్రి ఉత్తమ్ హెలికాప్టర్‌లో హుజూర్‌నగర్‌కు చేరుకుంటారు. ముందుగా ఆసియా ఖండం (Continent of Asia)లోనే అతి పెద్ద కాలనీని నిర్మాణాన్ని పరిశీలించనున్నారు. అనంతరం నేరుగా బహిరంగ సభ జరిగనే ప్రాంతానికి చేరుకుని రేషన్ కార్డుదారులకు సన్న బియ్యం పంపిణీ పథకాన్ని ప్రారంభిస్తారు. ఏప్రిల్ 1 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 84 శాతం మంది నిరుపేదలకు సన్న బియ్యం పంపిణీ చేసేందుకు సర్కార్ ఏర్పాట్లు చేస్తోంది. సన్న బియ్యం పంపిణీతో తాజాగా ప్రభుత్వంపై రూ.2,800 కోట్ల అదనపు భారం పడనుంది. ఏడాది పొడవున పంపిణీకి 36 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యం అవసరం పడుతాయని అధికారులు అంచానా వేశారు. ప్రస్తుతం తెలంగాణ (Telangana)లో 89.95 లక్షల రేషన్ కార్డులుండగా.. 2.81 కోట్ల మంది లబ్ధిదారులు ఉన్నట్లుగా తేలింది.