గాంధీ భవన్.. పేదల దేవాలయం.. మహేష్ కుమార్ గౌడ్ కీలక వ్యాఖ్యలు
హైదరాబాద్‌లోని గాంధీ భవన్(Gandhi Bhavan)లో ఉగాది వేడుకలు(Ugadi Celebrations) ఘనంగా నిర్వహించారు.
దిశ, వెబ్‌డెస్క్: హైదరాబాద్‌లోని గాంధీ భవన్(Gandhi Bhavan)లో ఉగాది వేడుకలు(Ugadi Celebrations) ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో టీపీసీసీ(Telangana Congress) చీఫ్, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్(Mahesh Kumar Goud) సహా పలువురు కీలక నేతలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ కార్యాలయమైన గాంధీ భవన్.. పేదల దేవాలయం లాంటిదని అన్నారు. ప్రజల ఆశీర్వాదంతో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందని తెలిపారు. రేవంత్ రెడ్డి సీఎంగా(CM Revanth Reddy), భట్టి విక్రమార్క ఉప ముఖ్యమంత్రిగా కేబినెట్ మంత్రులు ప్రజా సంక్షేమం కోసం, అభివృద్ధి కోసం అహర్నిశలు కృషి చేస్తున్నారని అన్నారు.
కష్టపడితే ఫలితం తప్పకుండా ఉంటుందని తెలిపారు. అనేక అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలు రాష్ట్ర ప్రభుత్వం ముందుకు సాగుతోందని చెప్పారు. పారిశ్రామిక అభివృద్ధి జరుగుతుంది.. పెట్టుబడులు పెట్టేందుకు విదేశీయులు ముందుకు వస్తున్నారు. మనం పండిస్తున్న సన్నబియ్యం ఫిలిప్పీన్స్‌కు ఎగుమతి చేస్తున్నాం.. విద్య పరంగా చాలా ఆలోచనలు చేస్తున్నారు.. ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ ఏర్పాటు చేస్తున్నామని అన్నారు.
రాష్ట్ర అభివృద్ధి కోసం క్షణం తీరిక లేకుండా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అహర్నిశలు కృషి చేస్తున్నారని అన్నారు. దేశంలో మల్లికార్జున్ ఖర్గే, యువ నాయకులు రాహుల్ గాంధీ, సోనియమ్మ నేతృత్వంలో కాంగ్రెస్ ఎంతో పటిష్టతతో ఉందని తెలిపారు. మరో పదేళ్లు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటుందని ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ ప్రజల పార్టీ అని.. వారి కోసమే పని చేస్తుందని అన్నారు. ఈ సంవత్సరం రాష్ట్ర ప్రజలకు మంచే జరుగాలని కోరుకుంటున్నట్లు తెలిపారు.