TG Assembly: నాకు సంస్కారం ఉంది కాబట్టే.. అలా మాట్లాడలే: కేటీఆర్ సెన్సేషనల్ కామెంట్స్

తెలంగాణ అసెంబ్లీ (Telangana Assembly)లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ (KTR) చేసిన 30 శాతం కమీషన్ల వ్యాఖ్యలు అధికార, విపక్ష పార్టీ సభ్యుల మధ్య మాటల యుద్ధానికి దారి తీశాయి.

Update: 2025-03-26 09:01 GMT
TG Assembly: నాకు సంస్కారం ఉంది కాబట్టే.. అలా మాట్లాడలే: కేటీఆర్ సెన్సేషనల్ కామెంట్స్
  • whatsapp icon

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ అసెంబ్లీ (Telangana Assembly)లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ (KTR) చేసిన 30 శాతం కమీషన్ల వ్యాఖ్యలు అధికార, విపక్ష పార్టీ సభ్యుల మధ్య మాటల యుద్ధానికి దారి తీశాయి. సభలో తమకు మాట్లాడేందుకు మైక్ ఇవ్వకపోవడంతో బీఆర్ఎస్ సభ్యులు (BRS Members) వాకౌట్ చేశారు. అనంతరం అసెంబ్లీ మీడియా పాయింట్ (Assembly Media Point) వద్ద కేటీఆర్ (KTR) మాట్లాడుతూ.. డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్కపై (Deputy CM Mallu Bhatti Vikramarka) తనకు అపారమైన గౌరవం ఉందని అన్నారు. 2009 నుంచి ఆయనతో కలిసి పని చేస్తున్నానని తెలిపారు. కానీ, సభ ఆర్డర్‌లో జరగడం లేదని, సభాపతిగా ఉన్న గడ్డం ప్రసాద్ కుమార్ తమ హక్కులను కాపాడాలని విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వ విప్‌గా ఉన్న ఆది శ్రీనివాస్ (Aadi Srinivas) కమిషన్ ‘కే’ అంటే కాకతీయ అని.. కమీషన్ ‘కే’ అంటే.. కరెంట్ కొనుగోళ్లు అంటూ అనుచిత వ్యాఖ్యలు చేశారని.. అవన్ని అనుచిత వ్యాఖ్యలు కావా.. అని స్పీకర్‌ను ప్రశ్నించారు. ఓటుకు నోటు కేసులో అడ్డంగా దొరికిన దొంగ.. రేవంత్ అని.. రూ.50 కోట్ల పెట్టి పీసీసీ చీఫ్ (PCC Chief) పదవి తెచ్చుకున్నాడని తాను అనొచ్చని అన్నారు. తనకు సంస్కారం ఉంది కాబట్టే.. అలా మాట్లాడలేదంటూ కేటీఆర్ *(KTR) చెప్పుకొచ్చారు. 

Tags:    

Similar News