అసంతృప్తి ఎందుకుండదు.. కచ్చితంగా ఉంటది.. MLC జీవన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు

తెలంగాణ కాంగ్రెస్(Telangana Congress) కీలక నేత, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడారు.

Update: 2025-03-25 12:10 GMT
అసంతృప్తి ఎందుకుండదు.. కచ్చితంగా ఉంటది.. MLC జీవన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు
  • whatsapp icon

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ కాంగ్రెస్(Telangana Congress) కీలక నేత, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి(MLC Jeevan Reddy) కీలక వ్యాఖ్యలు చేశారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడారు. పదవి రాకపోతే ఎవరికైనా అసంతృప్తి ఉంటుంది. అది సహజం అన్నారు. ప్రస్తుతం నేను కూడా అసంతృప్తితోనే ఉన్నాను అని హాట్ కామెంట్స్ చేశారు. మరోవైపు తెలంగాణ మంత్రివర్గ విస్తరనకు కాంగ్రెస్ హైకమాండ్(Congress High Command) గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం కొత్తగా నలుగురికి కేబినెట్‌లో చోటు కల్పించడానికి ప్రభుత్వం సిద్ధమైంది.

వీటితోపాటు డిప్యూటీ స్పీకర్, చీఫ్‌ విప్‌ పదవులను సైతం భర్తీ చేయనున్నట్లు సమాచారం. ఇటీవలే ఢిల్లీకి వెళ్లిన ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి(CM Revanth Redy), ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్‌లు ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, లోక్‌సభలో ప్రతిపక్షనేత రాహుల్‌గాంధీ, ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌(KC Venugopal)లతో సమావేశమయ్యారు. ఈ భేటీలో మంత్రివర్గ విస్తరనతో పాటు తాజా రాజకీయ పరిస్థితులపై సుదీర్ఘంగా చర్చించినట్లు తెలిసింది.

Tags:    

Similar News