HCA, SRH మధ్య సద్దుమణిగిన వివాదం.. దానికి ఇరు వర్గాలు అంగీకారం
హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్(Hyderabad Cricket Association), సన్ రైజర్స్ హైదరాబాద్(Sunrisers Hyderabad) యాజమాన్యం మధ్య నెలకొన్న వివాదం సద్దుమణిగింది.
దిశ, వెబ్‌డెస్క్: హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్(Hyderabad Cricket Association), సన్ రైజర్స్ హైదరాబాద్(Sunrisers Hyderabad) యాజమాన్యం మధ్య నెలకొన్న వివాదం సద్దుమణిగింది. మంగళవారం SRH ప్రతినిధులతో HCA సెక్రటరీ దేవరాజ్ భేటీ జరిపిన చర్చలు తాత్కాలికంగా సఫలం అయ్యాయి. SRH, HCA, బీసీసీఐ మధ్య జరిగిన త్రైపాక్షిక ఒప్పందాన్ని పాటించాలని SRH ప్రతిపాదింది. పాత ఒప్పందం ప్రకారమే స్టేడియం సామర్థ్యంలోని 10 శాతం కాంప్లిమెంటరీ పాసులను హెచ్‌సీఏకు కేటాయించనున్నారు. ఉప్పల్ స్టేడియంలో ఐపీఎల్ మ్యాచ్‌లను విజయవంతంగా నిర్వహించేందుకు ఎస్ఆర్‌హెచ్‌కు పూర్తిగా సహకరిస్తామని హెచ్‌సీఏ హామీ ఇచ్చింది. చర్చల అనంతరం వివాదాలన్నీ ముగిశాయని హెచ్‌సీఏ-ఎస్ఆర్‌హెచ్ ప్రకటించాయి.
ఇదిలా ఉండగా.. ఉచిత పాస్‌ల కోసం సన్ రైజర్స్ హైదరాబాద్ (SRH)పై హెచ్‌సీఏ ఆఫీస్ బేరర్ల వేధింపులను సర్కారు సీరియస్‌గా తీసుకున్నది. ఈ వ్యవహరంలో సీఎం రేవంత్ సోమవారం విజిలెన్స్ విచారణకు ఆదేశించారు. దర్యాప్తు జరిపి నివేదిక సమర్పించాలని డైరెక్టర్ జనరల్ విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ కొత్తకోట శ్రీనివాస రెడ్డి(Kothakota Srinivasa Reddy)ని రాష్ట్ర ప్రభుత్వం నియమించింది. సన్‌రైజర్స్ యాజమాన్యంపై హెచ్సీఏ ప్రెసిడెంట్ జగన్ మోహన్ రావు ప్రవర్తనపై ఉన్న అభ్యంతారాలు ఏమిటి? జగన్ ఎందుకు ఆలా వ్యవహరించారు? ఆయన వెనుక బీఆర్ఎస్ లీడర్లు ఉన్నారా? అనే కోణంలో ప్రస్తుతం పోలీసులు విచారణ జరుపుతున్నారు.