తెలంగాణలో బెట్టింగ్ యాప్స్ కలకలం.. రంగంలోకి జనసేన..!
బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసిన వారిపై పోరుకు జనసేన పార్టీ కూడా రంగంలోకి దిగింది...

దిశ, వెబ్ డెస్క్: బెట్టింగ్ యాప్స్(Betting App) ప్రమోషన్ కారణంగా తెలుగు రాష్ట్రాల్లో(Telugu States) చాలా ప్రాణాలు పోయాయని ఆవేదన వ్యక్తమవుతున్న నేపథ్యంలో జనసేన(Janasena) పార్టీ కూడా రంగంలోకి దిగింది. నిందితులను వదిలిపెట్టొద్దని డిమాండ్ చేస్తోంది. తెలంగాణ(Telangana)లో బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసిన బబర్దస్త్ వర్ష, హర్షసాయిపై హైదరాబాద్ ఉస్మానియా యూనివర్సిటీ(Hyderabad Osmania University) పోలీస్ స్టేషన్‌లో జనసేన పార్టీ విద్యార్థి విభాగం(Jana Sena Party Student Wing) నాయకులు ఫిర్యాదు చేశారు. నిందితులపై కేసులు నమోదు చేయాలని ఫిర్యాదు చేశారు.
కాగా బెట్టింగ్ యాప్స్ కారణంగా తెలంగాణలో చాలా మంది యువకులు బలి అయ్యారు. యాప్స్ ద్వారా బెట్టింగ్ నిర్వహించి డబ్బులు పోగొట్టుకుని, అప్పులు పాలయ్యి, వాటిని తీర్చలేక బలవన్మరణాలకు పాల్పడ్డారు. దీంతో ఈ ఘటనలు రాష్ట్రంలో సంచలనంగా మారాయి. పదులు సంఖ్యలో జరిగిన ఈ మరణాలు యావత్తు ప్రపంచాన్ని ఉలిక్కిపాటును గురి చేశాయి. దీంతో బెట్టింగ్ యాప్స్‌పై తీవ్ర వ్యతిరేకత పెరిగింది. దీంతో పోలీసులు రంగంలోకి దిగి బెట్టింగ్ యాప్స్ పై ఉక్కుపాదం మోపారు. ఈ యాప్స్ ప్రమోట్ చేసిన సినీ, టీవీ షోల సెలబ్రెటీలపై పోలీసులు కేసులు నమోదు చేసి విచారణ చేపట్టారు. ఇందులో భాగంగా ఇప్పటికే పలువురిని విచారించారు. పరారీలో ఉన్న మరికొందరికి నోటీసులు జారీ చేశారు. విచారణకు హాజరుకావాలని ఆదేశించారు. ఇంకొందరు కోర్టును ఆశ్రయించి తమను అరెస్ట్ చేయొద్దంటూ ఆదేశాలు తెచ్చుకున్నారు. ఈ నేపథ్యంలో సెలబ్రిటీలపై పోరాటం చేయాలని జనసేన పార్టీ ముందుకు వచ్చింది. యాప్స్ ప్రమోట్ చేసిన వారిపై ఆ పార్టీ విద్యార్థి విభాగం నాయకులు పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదు చేస్తున్నారు.