Thammineni Veerabhadram: లగచర్ల ఘటనలో రైతులను అరెస్ట్ చేయడం హేయం: తమ్మినేని వీరభద్రం హాట్ కామెంట్స్
లగచర్ల (Lagacharla) ఘటనలో రైతులను అరెస్ట్ చేయడం హేయమైన చర్య అని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం (CPM State Secretary Tammineni Veerabhadram) అన్నారు.
దిశ, వెబ్‌డెస్క్: లగచర్ల (Lagacharla) ఘటనలో రైతులను అరెస్ట్ చేయడం హేయమైన చర్య అని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం (CPM State Secretary Tammineni Veerabhadram) అన్నారు. ఇవాళ ఆయన సూర్యాపేటలో మీడియాతో మాట్లాడుతూ.. కేసీఆర్ (KCR) అనే మొక్కను మొలవనివ్వనని సీఎం రేవంత్ (CM Revanth) అంటున్నారు.. కానీ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ (Congress Party) ఇచ్చిన హామీల్లో ఏమి అమలు చేశారో ప్రజలకు సమాధానం చెప్పాలన్నారు. విజయోత్సవాలు జరుపుకునేంత స్థాయిలో కాంగ్రెస్ ప్రభుత్వ (Congress Government) పాలన లేదని కామెంట్ చేశారు.
రైతులను మోసం చేయడం, రైతుల భూములను లాక్కోవడంలో కాంగ్రెస్ (Congress), బీఆర్ఎస్ (BRS) పార్టీలు దొందు దొందేనని అన్నారు. విజయోత్సవాల పట్ల ప్రజలు వ్యతిరేకంగా ఉన్నారని అన్నారు. హైదరాబాద్ (Hyderabad) నుంచి ఫార్మా కంపెనీ (Pharma Companies)ల నుంచి వచ్చే జలాల వల్లే మూసీ (Musi) నీరు కలుషితమైందని తెలిపారు. కేసీఆర్ (KCR) పాలనను గుర్తుకు తెచ్చేలా.. రాష్ట్రంలో రేవంత్ (Revanth) పాలన కొనసాగిస్తున్నారని అన్నారు. ప్రజా వ్యతిరేక పాలనపై సీపీఎం (CPM) పోరాటం చేస్తుందని, రేపు లగచర్ల (Lagacharla)లో పర్యటించి వాస్తవాలను తెలుసుకుంటామని తమ్మినేని వీరభద్రం అన్నారు.