TGSRTC: తెలంగాణలో మరో రెండు కొత్త బస్ డిపోలు.. మంత్రి పొన్నం కీలక ప్రకటన

తెలంగాణ(Telangana)లో మరో రెండు కొత్త ఆర్టీసీ(TGSRTC) బస్సు డిపోలు(Bus Depots) మంజూరు అయ్యాయని, తెలంగాణలో ఆర్టీసీ ముందుకు వస్తుందనడానికి ఇదే నిదర్శనమని బీసీ, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్(Minister Ponnam Prabhakar) స్పష్టం చేశారు.

Update: 2024-12-04 08:27 GMT

దిశ, వెబ్ డెస్క్: తెలంగాణ(Telangana)లో మరో రెండు కొత్త ఆర్టీసీ(TGSRTC) బస్సు డిపోలు(Bus Depots) మంజూరు అయ్యాయని, తెలంగాణలో ఆర్టీసీ ముందుకు వస్తుందనడానికి ఇదే నిదర్శనమని బీసీ, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్(Minister Ponnam Prabhakar) స్పష్టం చేశారు. ఇవాళ ఆయన ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ.. ఈరోజు ఆర్టీసీ వ్యవస్థలో 10-15 సంవత్సరాల తర్వాత రెండు నూతన ఆర్టీసీ డిపోలు ఏర్పాటు చేస్తున్నామని, రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) నాయకత్వాన రవాణా శాఖ మంత్రి(Transport Minister)గా నాకు సంతృప్తిస్తుందని ఆనందం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా 10 నుండి 15 సంవత్సరాలుగా నష్టాల్లో ఉన్న ఆర్టీసీని లాభాల బాటలో తీసుకుపోతున్నామని, నూతన ఉద్యోగ నియామకాలు, నూతల బస్సుల కొనుగోలు, ఆర్టీసీ సంస్కరణలు, కార్మికుల సంక్షేమం కోసం చర్యలు చేపట్టామన్నారు.

అలాగే ప్రజల సౌకర్యార్థం జిల్లా కేంద్రాలుగా ఉన్న పెద్దపల్లి(Peddapalli), ములుగు(Mulugu) జిల్లాలోని ఏటూరు నాగారం(Eturu Nagaram)లో రెండు నూతన ఆర్టీసీ బస్సు డిపోలు ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. ఈ రెండు ఆర్టీసీ డిపోలకు సంబంధించి నిన్న ఆర్డర్లు వచ్చాయని, ఇవి ఆయా జిల్లాల మంత్రులకు, ఎమ్మెల్యేలకు అందిస్తామని అన్నారు. రెండు నూతన డిపోల ద్వారా ఆ ప్రాంత ప్రయాణికులకు మూడు రాష్ట్రాల సరిహద్దు ప్రయాణికులకు సౌకర్యాన్ని అందిస్తూ.. త్వరలోనే బస్సు డిపో నిర్మాణాలు ప్రారంభిస్తామని చెప్పారు. పెద్దపల్లి పారిశ్రామిక ప్రాంతం జిల్లా కేంద్రం చేసిన అక్కడ బస్సు డిపో లేకపోవడంతో రవాణా శాఖ మంత్రిగా జిల్లా మంత్రి శ్రీధర్ బాబు(Minister Sridhar Babu), ఎమ్మెల్యే విజయరమణారావు(MLA Vijaya Ramana Rao) విజ్ఞప్తి మేరకు అక్కడ బస్సు డిపో మంజూరు చేయడం జరిగిందన్నారు. ఇక రెండు జిల్లాల ప్రజలకు నూతన బస్సు డిపో మంజూరు అయిన సందర్భంగా మంత్రి శుభాకాంక్షలు తెలియజేశారు. 

Tags:    

Similar News