బుర్రా వెంకటేశం వీఆర్ఎస్‌కు ఆమోదం
తెలంగాణ పబ్లిక్ సర్వీసు కమిషన్ చైర్మన్‌గా బుర్ర వెంకటేశం గురువారం బాధ్యతలు స్వీకరించనున్నారు.
దిశ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ పబ్లిక్ సర్వీసు కమిషన్ చైర్మన్‌గా బుర్ర వెంకటేశం గురువారం బాధ్యతలు స్వీకరించనున్నారు. బుధవారం ఆయన రాజీనామాను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి ఆమోదించారు. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు. ఉమ్మడి వరంగల్ జిల్లాకు జనగామ ప్రాంతానికి చెందిన బుర్రా వెంకటేశం 1995 ఐఏఎస్ బ్యాచ్‌కు చెందిన అధికారి. టీజీపీఎస్సీ ఛైర్మన్‌గా తెలంగాణ చెందిన వ్యక్తిని నియమించాలనే ఉద్దేశంతో ఆయనను నియమించింది.
పేద కుటుంబంలో పుట్టి బీసీ వర్గం. చిన్ననాటి నుంచి కష్టపడి పైకి వచ్చిన వ్యక్తి బుర్రా వెంకటేశం కీలకమైన పదవికి సరైన న్యాయం చేస్తారనే ఉద్దేశం ప్రభుత్వం ఆయనను నియమించింది. ఆయన 2030 ఏప్రిల్ వరకు టీజీపీఎస్సీ చైర్మన్‌గా కొనసాగనున్నారు. టీజీపీఎస్సీ ఛైర్మన్ 62 సంవత్సరాల వయస్సు లేదా ఆరు సంవత్సరాలు గరిష్ఠంగా ఆ పదవిలో కొనసాగుతారు. ఇప్పటి వరకు ఛైర్మన్ గా ఉన్న మహేందర్ రెడ్డి ఈనెల 3న పదవి కాలం ముగిసింది.