Breaking News : తెలంగాణకు కింగ్ ఫిషర్ బీర్ల సరఫరా నిలిపివేత

తెలంగాణ మద్యం ప్రియులకు బ్యాడ్ న్యూస్.

Update: 2025-01-08 10:34 GMT

దిశ, వెబ్ డెస్క్ : తెలంగాణ మద్యం ప్రియులకు బ్యాడ్ న్యూస్. తెలంగాణలో పలు బీర్ల సరఫరా నిలిపేస్తూ యునైటెడ్‌ బ్రివరీస్ లిమిటెడ్(UBL) నిర్ణయం తీసుకుంది. కింగ్ ఫిషర్, హీనెకెన్ బీర్ల(Hinken Beers) అమ్మకాలు నిలిపివేస్తూ యూబీ ఉత్తర్వులు జారీ చేసింది. తెలంగాణలో 2019 నుంచి ధరలను సవరించకపోవడం, బీసీఎల్ బకాయిలు చెల్లించకపోవడంతో తమకు భారీ నష్టాలు వస్తున్నాయని, గత్యంతరం లేక బీర్ల సరఫరా నిలిపివేస్తున్నట్టు యునైటెడ్‌ బ్రివరీస్ లిమిటెడ్ పేర్కొంది. ఈ నిర్ణయంతో ఇక తెలంగాణలో కింగ్ ఫిషర్ బీర్లు లేనట్టేనా అని మద్యం ప్రియులు వాపోతున్నారు. ఏది ఏమైనా రానున్న సంక్రాంతి పండగ నేపథ్యంలో మందుబాబులకు భారీ షాక్ తగిలింది అనే చెప్పాలి. రాష్ట్రానికి అత్యధిక ఆదాయం మద్యం నుంచే వస్తుంది కాబట్టి, మరి ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి. 




 


Tags:    

Similar News