Breaking News : కేటీఆర్ లంచ్ మోషన్ పిటిషన్లో హైకోర్ట్ కీలక ఆదేశాలు

ఏసీబీ(ACB) విచారణకు తన వెంట లాయర్‌ను అనుమతించాలని కోరుతూ.. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్‌‌ (KTR) హైకోర్టు (High Court)లో లంచ్ మోషన్ పిటిషన్ (Lunch Motion Petition) దాఖలు చేసిన విషయం తెలిసిందే.

Update: 2025-01-08 11:24 GMT

దిశ, వెబ్ డెస్క్ : ఏసీబీ(ACB) విచారణకు తన వెంట లాయర్‌ను అనుమతించాలని కోరుతూ.. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్‌‌ (KTR) హైకోర్టు (High Court)లో లంచ్ మోషన్ పిటిషన్ (Lunch Motion Petition) దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ పిటిషన్‌పై విచారణ చేపట్టిన కోర్ట్ కీలక ఆదేశాలు జారీ చేసింది. ఏసీబీ విచారణలో కేటీఆర్ వెంట న్యాయవాది కలిసి కూర్చునేందుకు అనుమతించే ప్రసక్తే లేదని కోర్టు స్పష్టం చేసింది. సీసీ టీవీ పర్యవేక్షణలో కేటీఆర్‌ విచారణ జరపాలని, విచారణ జరుగుతుండగా లైబ్రరీ రూంలో లాయర్‌ కూర్చునేందుకు అనుమతినిస్తూ హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. కేటీఆర్‌ ఓగదిలో, లాయర్‌ మరో గదిలో ఉండాలని తెలిపిన కోర్ట్.. ఆడియో, వీడియో రికార్డింగ్‌కు మాత్రం అనుమతివ్వలేదు. ఏమైనా అభ్యంతరాలుంటే మళ్ళీ కోర్టుకు రావొచ్చన్న న్యాయమూర్తి ఆదేశాలు జారీ చేశారు.

Tags:    

Similar News