Hyd: ఎకో టూరిజం ఆఫీసుకు సీఎం రేవంత్ శంకుస్థాపన
ఎకో టూరిజం ఆఫీసుకు సీఎం రేవంత్ శంకుస్థాపన చేశారు..
దిశ, తెలంగాణ బ్యూరో: ఫారెస్ట్ అండ్ ఎకో టూరిజం డెవలప్ మెంట్ ఆఫీస్‌కు మంత్రి కొండా సురేఖతో కలిసి బుధవారం సీఎం రేవంత్ రెడ్డి వర్చువల్‌గా శంకుస్థాపన చేశారు. అదే విధంగా కొత్తగూడెం - పాల్వంచ డివిజనల్ మేనేజర్ ఆఫీస్ కాంప్లెక్స్, సత్తుపల్లి డివిజనల్ మేనేజర్ ఆఫీస్ కాంప్లెక్స్‌లను వర్చువల్‌గా ప్రారంభించారు. అదే విధంగా కొండాపూర్‌లోని కోట్ల విజయ భాస్కర్ రెడ్డి బొటానికల్ గార్డెన్స్‌లో పలు అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభించారు. అనంతరం వృక్ష పరిచయ క్షేత్రం(75 థీమ్స్ పార్క్)ను ప్రారంభించి బ్యాటరీ వాహనంలో సీఎం రేవంత్ రెడ్డితో కలిసి మంత్రి సురేఖ, ఎమ్మెల్యే అరికపూడి గాంధీ, మేయర్ గద్వాల్ విజయలక్ష్మి, టీజీఎప్ డీసీ కార్పోరేషన్ చైర్మన్ పొదెం వీరయ్యలు థీమ్స్ పార్క్ ను సందర్శించారు. అటవీ అధికారులు పార్కు ప్రత్యేకతను శాస్త్రీయంగా వివరించారు. వర్చువల్ వైల్డ్ లైఫ్ సఫారీ పార్కులో భాగంగా గార్డియన్స్ ఆఫ్ ది వైల్డ్, జంగిల్ ఒడిస్సీ 9డీ సినిమా, 360 డిగ్రీ థియేటర్, వీఆర్ ఎక్స్ పీరియన్స్ జూలను మంత్రి సురేఖ ప్రారంభించారు.
అంతకు ముందు సీఎంతో కలిసి పార్కులో మంత్రి సురేఖ మొక్కలను నాటారు. తెలంగాణ ఫారెస్ట్ డెవలప్ మెంట్ కార్పోరేషన్ (టీజీఎఫ్ డీసీ) నూతన వాహనాలను మంత్రి జెండా ఊపి ప్రారంభించారు. స్వయంగా మంత్రి వాహనం నడిపి అటవీశాఖ సిబ్బందిలో జోష్ నింపారు.