పెండింగ్ సమస్యలపై కోదండరాం కీలక వ్యాఖ్యలు

ఉద్యమాల నుంచి వచ్చిన వ్యక్తులు ప్రభుత్వంలో ఉండాలని, అప్పుడే ప్రజలకు నిజమైన న్యాయం జరుగుతుందని ఎమ్మెల్సీ కోదండరాం పేర్కొన్నారు...

Update: 2024-12-04 16:28 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: ఉద్యమాల నుంచి వచ్చిన వ్యక్తులు ప్రభుత్వంలో ఉండాలని, అప్పుడే ప్రజలకు నిజమైన న్యాయం జరుగుతుందని ఎమ్మెల్సీ కోదండరాం పేర్కొన్నారు. బుధవారం ఆయన హైదరాబాద్‌లో మహిళా వికలాంగుల సాధికారత కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ కోదండరాం మాట్లాడుతూ ప్రజా ప్రభుత్వంలో పదేళ్ల పెండింగ్ సమస్యలన్నీ నెరవేరుతున్నాయన్నారు. ఒక్కొక్కటిగా క్లియర్ చేస్తున్నామన్నారు. పేద వర్గాలకు ఈ ప్రభుత్వం పెద్ద పీఠ వేస్తుందన్నారు. ప్రస్తుత కార్పొరేషన్ చైర్మన్ ముత్తినేని వీరయ్య వికలాంగుల అంశంపై గత 10 ఏండ్లు ఉద్యమాలు చేయడంతోనే ఇప్పుడు న్యాయం జరుగుతుందన్నారు. ఆ అంశంపై స్పష్టమైన అవగాహన ఉండటం వలన ఇప్పుడు సమస్య పరిష్కరానికి చెక్ పడుతుందని ఎమ్మెల్సీ కోదండరాం అన్నారు.

వికలాంగుల కార్పొరేషన్ చైర్మన్ ముత్తినేని వీరయ్య మాట్లాడుతూ.. మహిళా వికలాంగులకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నామన్నారు. రాష్ట్ర ప్రభుత్వ మహిళలకు అందిస్తున్న అన్నీ పథకాల్లో 5 శాతం మహిళ వికలాంగులకు ప్రాధాన్యత ఇవ్వాలని ఇప్పటికే సీఎం దృష్టికి తీసుకువెళ్లానన్నారు. 2016 వికలాంగుల చట్టం అమలయ్యేలా కృషి చేస్తానని తెలిపారు. 2014లో బీజేపీ ఒక్క రూపాయి కూడా పెన్షన్ పెంచలేదన్నారు. ప్రస్తుతం కేవలం రూ. 300 ఇస్తున్నారని, దీన్ని మూడు వేలు చేయాలని కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాలన్నారు. దమ్ముంటే కిషన్ రెడ్డి పింఛన్ పెంచేందుకు చొరవ చూపాలన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన మాట నెరవేర్చుతుంటే, బీజేపీ విమర్శలు తగదని వీరయ్య హెచ్చరించారు.


Similar News