TG Assembly: కేసీఆర్ కాపలా కుక్క కాదు.. రాష్ట్రాన్ని దోచుకునే వేట కుక్క: మంత్రి పొంగులేటి సెన్సేషనల్ కామెంట్స్

తెలంగాణ (Telangana)కు కేసీఆర్ (KCR) కాపలా కుక్కలా లేరని.. రాష్టాన్ని దోచుకునే వేట కుక్కలా వ్యవహరించారని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.

Update: 2024-12-20 09:11 GMT

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ (Telangana)కు కేసీఆర్ (KCR) కాపలా కుక్కలా లేరని.. రాష్టాన్ని దోచుకునే వేట కుక్కలా వ్యవహరించారని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇవాళ భూ భారతి బిల్లు (Bhu Bharathi Bill) చర్చ సందర్భంగా ఆయన సభలో మాట్లాడుతూ.. చేసిన అక్రమాలను కప్పపుచ్చుకునేందుకు బీఆర్ఎస్ పార్టీ (BRS Party) ప్రయత్నం చేస్తోందని మండిపడ్డారు. అసెంబ్లీ (Assembly) సాక్షిగా ఆ పార్టీ నేతలు అబద్ధాలు చెప్పి ఏదో విధంగా ప్రజలను మభ్య పెట్టాలని చూస్తున్నారని ఫైర్ అయ్యారు.

సభా సాంప్రదాయాలను మరిచి బీఆర్ఎస్ (BRS) సభ్యులు రౌడీలు, గుండాల్లా ప్రవర్తిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓ దళిత స్పీకర్‌ (Speaker)పై పుస్తకాలు విసిరారని.. తనపై కూడా దాడి చేసేందుకు యత్నించారని ఆయన ఆరోపించారు. తెలంగాణ (Telangana)కు కేసీఆర్ (KCR) కాపలా కుక్కలా లేరని.. రాష్ట్రాన్ని దోచుకునే వేట కుక్కలా వ్యవహరించారని ఆరోపించారు. ఎవరెన్ని కుట్రలు చేసినా.. ‘ధరణి’ (Dharani)పై పూర్తి స్థాయిలో విచారణ జరిపిస్తామని, నిజాలను నిగ్గు తేలుస్తామని మంత్రి పొంగులేటి స్పష్టం చేశారు.  

Tags:    

Similar News