మెగాస్టార్ చిరంజీవికి సజ్జనార్ స్పెషల్ విషెస్

ప్రముఖ సినీ నటుడు మెగాస్టార్ చిరంజీవి(Megastar Chiranjeevi)కి తెలంగాణ ఆర్టీసీ ఎండీ, ఐపీఎస్ అధికారి సజ్జనార్(Sajjanar) శుభాకాంక్షలు తెలిపారు.

Update: 2025-03-21 15:32 GMT
మెగాస్టార్ చిరంజీవికి సజ్జనార్ స్పెషల్ విషెస్
  • whatsapp icon

దిశ, వెబ్‌డెస్క్: ప్రముఖ సినీ నటుడు మెగాస్టార్ చిరంజీవి(Megastar Chiranjeevi)కి తెలంగాణ ఆర్టీసీ ఎండీ, ఐపీఎస్ అధికారి సజ్జనార్(Sajjanar) శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా పోస్టు పెట్టారు. ‘‘మీరు భారతీయ సినిమాను గర్వపడేలా చేశారు. బ్రిటీష్ ప్రభుత్వం నుండి ప్రతిష్టాత్మకమైన "జీవిత సాఫల్య పురస్కారం" అందుకున్న తొలి భారతీయ ప్రముఖుడిగా చరిత్ర సృష్టించారు. సినిమా మరియు మీరు చేసిన సేవలు లక్షలాది మందికి స్ఫూర్తినిస్తూనే ఉన్నాయి. ఇది భారతదేశానికి గర్వకారణమైన క్షణం, ఆయన అసాధారణ వారసత్వానికి నిదర్శనం’ అని సోషల్ మీడియాలో సజ్జనార్ పేర్కొన్నారు. మెగాస్టార్ చిరంజీవిని యూకే పార్లమెంట్‌లోని హౌస్‌ ఆఫ్‌ కామన్స్‌ లో ఘనంగా సత్కరించిన సంగతి తెలిసిందే. నాలుగున్నర దశాబ్దాలుగా సినీ రంగానికి, సమాజానికి ఆయన చేసిన సేవలకు గుర్తింపుగా లైఫ్‌ టైమ్ అచీవ్‌మెంట్‌ అవార్డు(Lifetime Achievement Award)ను అందించారు. దీనికి సంబంధించిన వీడియోలు, ఫొటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.

Tags:    

Similar News