తెలంగాణ జర్నలిస్టులకు శుభవార్త
జర్నలిస్టులకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. అక్రిడిటేషన్ కార్డుల గడువును మరో మూడు నెలల పొడగించారు.

దిశ, తెలంగాణ బ్యూరో: జర్నలిస్టులకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. అక్రిడిటేషన్ కార్డుల గడువును మరో మూడు నెలల పొడగించారు. ఇప్పుడున్న అక్రిడేషన్‌ల పొడగింపు మార్చి 31తో ముగియనుంది. ఈ నేపథ్యంలో గడువును మరో మూడు నెలల పొడగించాలని సమాచార పౌరసంబంధాల శాఖ నిర్ణయించింది. జూన్ చివరి వరకు ఇప్పుడున్న అక్రిడేషన్‌లు అమల్లో ఉంటాయి. కొత్త అక్రిడేషన్ కార్డుల జారీకి సంబంధించి మార్గదర్శకాలు విడుదల కావాల్సి ఉంది. ఆ తరువాత అక్రిడేషన్ కమిటీల ఏర్పాటు, దరఖాస్తుల స్వీకరణ, కొత్త జారీ ప్రక్రియ సాగనుంది.