MLA Kunamneni Sambasiva Rao : రైతులందరికీ రుణమాఫీ చేయాలి : ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు

సీపీఐ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు(MLA Kunamneni Sambasiva Rao) రాష్ట్ర ప్రభుత్వంపై విమర్శలు చేశారు.

Update: 2025-03-21 15:05 GMT
MLA Kunamneni Sambasiva Rao : రైతులందరికీ రుణమాఫీ చేయాలి : ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు
  • whatsapp icon

దిశ, వెబ్ డెస్క్ : సీపీఐ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు(MLA Kunamneni Sambasiva Rao) రాష్ట్ర ప్రభుత్వంపై విమర్శలు చేశారు. శుక్రవారం అసెంబ్లీ ఆవరణలో మీడియా పాయింట్ వద్ద ఆయన మాట్లాడుతూ.. రైతులకు రుణమాఫీ(Farmer Loan waiver) సరిగా అమలు కాకపోవడంతో తీవ్ర ఇబ్బంది పడుతున్నారని అన్నారు. తక్షణమే అర్హులైన వారందరికీ రుణమాఫీ చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. జనగామ జిల్లాలోని నిడిగొండ గ్రామంలో 554 మంది రైతుల్లో ఇద్దరికి మాత్రమే రుణ మాఫీ వచ్చిందని, మిగిలిన వాళ్లకు ఆధార్ సమస్యల వల్ల రాలేదని, లోపాలను వెంటనే సరిచేసి వారికి రుణమాఫీ చేయాలని పేర్కొన్నారు. అలాగే, హైదరాబాద్ విశ్వవిద్యాలయ(HCU) భూమి 400 ఎకరాలు అమ్మాలన్న ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకించారు. దీనికి బదులుగా పేదలు ఆక్రమించిన భూములను క్రమబద్ధీకరించి, రుసుము తీసుకుంటే ఆదాయం వస్తుందని, పేదలకు కూడా మేలు జరుగుతుందని సూచించారు. ల్యాండ్ మాఫియాలు తీసుకున్న భూములను తిరిగి ప్రభుత్వం స్వాధీనం చేసుకుని వేలం వేయాలని అంతేకాని విశ్వవిద్యాలయ భూమిని అమ్మవద్దని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం అన్నారు.

Tags:    

Similar News