TG Assembly: స్పీకర్‌ను కలిసిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు.. అసలు విషయం ఇదే!

అసెంబ్లీ సమావేశాలు (Assembly Sessions) కొనసాగుతోన్న వేళ మరో కీలక పరిణామం చోటుచేసుకుంది.

Update: 2025-03-15 04:51 GMT
TG Assembly: స్పీకర్‌ను కలిసిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు.. అసలు విషయం ఇదే!
  • whatsapp icon

దిశ, వెబ్‌డెస్క్: అసెంబ్లీ సమావేశాలు (Assembly Sessions) కొనసాగుతోన్న వేళ మరో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. ఈ మేరకు ఇవాళ సభ ప్రారంభమయ్యే మందు బీఆర్ఎస్ (BRS) ఎమ్మెల్యేలు హరీష్ రావు (Harish Rao), సుధీర్ రెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్, మాధవరం కృష్ణారావు, సబితా ఇంద్రారెడ్డి, కేపీ వివేకానంద, స్పీకర్‌ గడ్డం ప్రసాద్ కుమార్‌ (Speaker Prasad Kumar)ను ఆయన ఛాంబర్‌కు వెళ్లి కలిశారు. అనంతరం తమ సభ్యుడు జగదీశ్ రెడ్డిపై సస్పెన్షన్‌ను ఎత్తి వేయాలని విజ్ఞప్తి చేశారు. స్పీకర్‌‌పై జగదీశ్ రెడ్డి (Jagadish Rao) ఏక వచనంతో ఎక్కడా మాట్లాడలేదని.. ఆయనపై సస్పెన్షన్ వేటు అక్రమం, అన్యాయమని సవివరంగా విన్నవించారు. సభా సంప్రదాయలను కూడా ఎక్కడా ఉల్లంఘించలేదని తెలిపారు. వెంటనే జగదీశ్ రెడ్డిపై సస్పెన్షన్‌‌ను ఎత్తి వేయాలని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అంతా స్పీకర్‌ను విజ్ఞప్తి చేశారు. 

Tags:    

Similar News