ఇక నుంచి నాకు అవి ఇవ్వకండి.. తెలంగాణ మంత్రి కీలక నిర్ణయం
ప్రముఖులను కలవడానికి వెళ్లినప్పుడు ఎవరైనా బొకేలు, శాలువాలు తీసుకెళ్లడం కామన్.

దిశ, వెబ్‌డెస్క్: ప్రముఖులను కలవడానికి వెళ్లినప్పుడు ఎవరైనా బొకేలు, శాలువాలు తీసుకెళ్లడం కామన్. కలిసిన వెంటనే బొకేలతో పలకరించుకోవడం, శాలువాతో సత్కరించుకోవడం ఆనవాయితీగా వస్తోంది. ఈ నేపథ్యంలో శాలువాలు, బొకేలపై తెలంగాణ అటవీ, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ(Minister Konda Surekha) కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈరోజు నుంచి తనను కలవడానిక వచ్చే వారెవరూ బొకేలు, శాలువాలు తీసుకురావొద్దని చెప్పారు. వందలాది.. వేలాది.. రూపాయలు తనకోసం ఖర్చుపెట్టవద్దని కోరారు. వాటికి పెట్టే పైసల్ని తిండి లేని అభాగ్యులకు ఉపయోగించాలని సూచించారు. ఈ మేరకు అటవీ, దేవాదాయ శాఖ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. మంత్రి నిర్ణయం పట్ల సర్వత్రా హర్షం వ్యక్తం చేస్తూ అభినందిస్తున్నారు.
అంతకుముందు.. అడవులను సంరక్షించుకోవాలని పిలుపునిచ్చారు. ఓ వైపు ఉన్న అడవులను సంరక్షించుకుంటూనే, మరోవైపు అటవీ సంపదను పెంచేందుకు సమర్పణ, సంకల్పంతో ముందుకు సాగుతున్నామని అన్నారు. తెలంగాణ ప్రభుత్వం కూడా వనమహోత్సవం కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున చేపడుతుందని చెప్పారు. ఇందు కోసం పెద్ద ఎత్తున నిధులు ఖర్చు చేస్తున్నదని అన్నారు.