త్వరలోనే తెలంగాణలో భయంకరమైన చట్టాలు: BJP ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు

బీజేపీ‌ఎల్పీ నేత, నిర్మల్ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్శర్ రెడ్డి మరోసారి కాంగ్రెస్ ప్రభుత్వంపై సంచలన వ్యాఖ్యలు చేశారు. సోమవారం ఆయన

Update: 2024-07-01 12:31 GMT

దిశ, వెబ్‌డెస్క్: బీజేపీ‌ఎల్పీ నేత, నిర్మల్ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్శర్ రెడ్డి మరోసారి కాంగ్రెస్ ప్రభుత్వంపై సంచలన వ్యాఖ్యలు చేశారు. సోమవారం ఆయన మాట్లాడుతూ.. రూ.2 లక్షల రైతు రుణ మాఫీ అమలు చేసేందుకు రాష్ట్రంలోని భూములను అమ్మేందుకు సీఎం రేవంత్ రెడ్డి సిద్ధమయ్యారని అన్నారు. దాదాపు రూ.30 వేల కోట్ల విలువైన భూముల అమ్మకానికి ప్రభుత్వం రెడీ అయ్యిందని కీలక వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం త్వరలోనే రాష్ట్రంలో భయంకరమైన చట్టాలు తీసుకురాబోతుందని సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ నేతలు తమ జేబులు నింపుకునేందుకు కొత్త చట్టాలు తెస్తున్నారని ఆరోపించారు. భవిష్యత్‌లో తెలంగాణలో పార్కులకు కూడా స్థలం ఉండదని షాకింగ్ కామెంట్స్ చేశారు. రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితి, లా అండ్ అర్డర్ అస్తవ్యస్తంగా తయారైందని రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు.

కాగా, కాంగ్రెస్ హామీ ఇచ్చినట్లుగా రూ.2 లక్షల రుణమాఫీకి కసరత్తు మొదలుపెట్టింది. సీఎం రేవంత్ రెడ్డి మాట ఇచ్చినట్లుగా ఆగస్ట్ 15లోపు చేసి తీరుతామని చెప్పిన వేళ మహేశ్వర్ రెడ్డి కామెంట్స్ చర్చనీయాంశంగా మారింది. దీంతో పాటుగా ప్రభుత్వం త్వరలోనే అసెంబ్లీ సమావేశాలు నిర్వహించి కొత్త బిల్లులు తీసుకురానున్నట్లు ప్రచారం జరుగుతోన్న వేళ భయంకరమైన చట్టాలు అంటూ బీజేపీ ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి వ్యాఖ్యానించడం స్టేట్ పాలిటిక్స్‌లో హాట్ టాపిక్‌గా మారింది. ప్రభుత్వం తీసుకురాబోతున్న బిల్లులు ఏంటనే వాటిపై ఉత్కంఠ నెలకొంది. 

 


Similar News