MLC Jeevan Reddy: ఫిరాయింపులతో ఆత్మస్థైర్యం కోల్పోయాం.. జీవన్‌రెడ్డి సంచలన వ్యాఖ్యలు
ఫిరాయింపులతో ఆత్మస్థైర్యం కోల్పోయామని ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి (MLC Jeevan Reddy) మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు.
దిశ, వెబ్‌డెస్క్: ఫిరాయింపులతో ఆత్మస్థైర్యం కోల్పోయామని ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి (MLC Jeevan Reddy) మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇవాళ కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ఎంపీ మధుయాష్కీ గౌడ్ (Madhu Yashki Goud), జీవన్‌రెడ్డి (Jeevan Reddy)ని బుజ్జగించేందుకు జగిత్యాల (Jagityala)లోని ఆయన ఇంటికి వెళ్లారు. ఇప్పటికే పార్టీ అధినాయకత్వానికి జీవన్‌రెడ్డి (Jeevan Reddy) కూడా లేఖ రాశారు.
ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ఫిరాయింపు ఎమ్మెల్యేలపై ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ పార్టీ (Congress Party)లో ఫిరాయింపులతో తాము ఆత్మస్థైర్యం కోల్పో్యామని అన్నారు. తనకు చెప్పకుండానే, కనీస సమాచారం లేకుండానే జగిత్యాల ఎమ్మెల్యే (Jagityala MLA)ను కాంగ్రెస్ పార్టీలో చేర్చుకున్నారని ఆరోపించారు. ఈ క్రమంలోనే తాను గంగారెడ్డి (Ganga Reddy)ని కోల్పోయానని జీవన్‌రెడ్డి (Jeevan Reddy) భావోద్వేగానికి గురయ్యారు.
Read More : Madhu Yashki: వాళ్లు పార్టీపై ప్రేమతో రాలేదు.. పార్టీ ఫిరాయింపులపై మధుయాష్కీ సంచలన వ్యాఖ్యలు