Aghori : నా బిడ్డ.. అఘోరీ వశం! ఎలాగైనా మాకు అప్పగించండి

తెలుగు రాష్ట్రాల్లో కొద్దికాలంగా హల్చల్ చేస్తున్న అఘోరిపై ఓ యువతి తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు

Update: 2025-03-25 10:20 GMT
Aghori : నా బిడ్డ.. అఘోరీ వశం! ఎలాగైనా మాకు అప్పగించండి
  • whatsapp icon

మంగళగిరి పోలీసులకు యువతి తండ్రి ఫిర్యాదు

అఘోరి నన్ను టార్చర్ చేశాడు అంటున్న యువతి అన్న

దిశ డైనమిక్ బ్యూరో: తెలుగు రాష్ట్రాల్లో కొద్దికాలంగా హల్చల్ చేస్తున్న అఘోరిపై ఓ యువతి తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు. తెలుగు రాష్ట్రాల్లో కొద్దికాలంగా హల్చల్ చేస్తున్న అఘోరిపై ఓ యువతి తల్లిదండ్రులు కేసు నమోదు చేశారు. తమ కుమార్తెను అఘోరి వశపరచుకుందని అఘోరీ వద్ద నుంచి తమ కూతురిని ఎలాగైనా అప్పగించాలని కోరుతున్నారు. యువతి తండ్రి కోటయ్య మంగళగిరి పోలీసు స్టేషన్​లో ఫిర్యాదు చేశాడు. ఈ ఫిర్యాదులో పలు సంచలన విషయాలు వెలుగు చూశాయి. లేడీ అఘోరీ మా కూతురిని కిడ్నాప్ చే.. మత్తుమందులు ఇచ్చి తన వశం చేసుకుంది అంటూ ఆ తండ్రి వాపోతున్నాడు. కుటుంబ సభ్యులు ఎంత ఒత్తిడి చేసినా శ్రీ వర్షిణి ఒక్కసారి కూడా ఇంటికి రావడం లేదని, ఫోన్ చేయడం లేదని కోటయ్య ఆవేదన వ్యక్తం చేశారు. తన బిడ్డను అఘోరి నుంచి విడిపించాలని తల్లి కోరుతోంది. ఆ యువతి అన్న కూడా పలు విషయాలను వెల్లడించాడు. తనను సెక్స్​వల్​గా టార్చర్​పెట్టిందని పేర్కొన్నాడు. లేడి అఘోరి అమ్మాయి కాదు.. మగ లక్షణాలు ఉన్నాయంటూ తెలిపాడు. ఆమెకు కొంతమంది రాజకీయ నాయకులతో సంబంధాలు ఉన్నాయని వారు ఆర్థికంగా సాయం చేస్తన్నారని తెలిపారు. లేడి అఘొరి వద్ద ఉన్న తమ చెల్లెల్ని తమకు అప్పగిస్తే .. తాము ఆస్పత్రిలో చికిత్స చేయించుకుంటామని పోలీసులను కోరారు. కొంతకాలంగా లేడి అఘోరి తెలుగు రాష్ట్రాల్లో కలకలం రేపింది. అడ్డుకున్న పోలీసుల మీద దాడులు చేయడం, రోడ్డుపైన ఆలయాల వద్ద హడావుడి చేయడం.. వంటివి చేసింది. ఇప్పుడు ఓ అమ్మాయిని కిడ్నాప్​ చేశారనే ఆరోపణలు ఎదుర్కొంటోంది.

Tags:    

Similar News