Bhatti Vikramarka: మరికాసేపట్లో కేబినెట్ భేటీ.. డిప్యూటీ సీఎంతో ఉద్యోగ జేఏసీ నేతల భేటీ

డిప్యూటీ సీఎంతో ఉద్యోగ సంఘాల జేఏసీ నేతల భేటీ అయ్యారు.

Update: 2024-10-26 06:35 GMT

దిశ, డైనమిక్ బ్యూరో: డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క (Bhatti Vikramarka)తో తెలంగాణ ఉద్యోగ సంఘాల జేఏసీ నేతలు (Employees JAC) భేటీ అయ్యారు. శనివారం హైదరాబాద్ ప్రజా భవన్ (Praja Bhavan) లో భట్టిని కలిసి గత ప్రభుత్వంలో ఇవ్వాల్సిన 3 పెండింగ్ డీఏలు (Pending DA), ఈ ప్రభుత్వంలో రావాల్సిన 2 డీఏలను వెంటనే రిలీజ్ చేయాలని కోరారు. అలాగే ఉద్యోగులకు సంబంధించిన పలు సమస్యలను భట్టి దృష్టికి తీసుకువెళ్లారు. రెండు రోజుల క్రితం సీఎంతో ఉద్యోగ సంఘాలు భేటీ అయ్యాయి. ఈ సందర్భంగా ఉద్యోగ, ఉపాధ్యాయ సమస్యలపై చర్చించి, పరిష్కారం చూపేందుకు ఉప ముఖ్య మంత్రి భట్టి విక్రమార్క చైర్మన్ గా మంత్రివర్గ ఉప సంఘాన్ని నియమిస్తామని సీఎం ప్రకటించారు. సభ్యులుగా మంత్రులు శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్, ప్రత్యేక ఆహ్వానితుడిగా ప్రభుత్వ సలహాదారు కే కేశవరావు ఉంటారని వెల్లడించారు. ఈ క్రమంలో నిన్న సీఎస్ శాంతి కుమారి (CS Shanthi kumari)తో సమావేశం అయిన ఉద్యోగ జేఏసీ నేతలు.. ఇవాళ భట్టి విక్రమార్కను కలిసి తమ సమస్యలను వివరించారు. మరికాసేపట్లో కేబినెట్ (cabinet meeting) సమావేశం జరగబోతున్న నేపథ్యంలో డిప్యూటీ సీఎంను కలవడంతో కేబినెట్ ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నదనేది ఆసక్తిగా మారింది.

Tags:    

Similar News