Anneparthi: అన్నెపర్తి 12వ బెటాలియన్ కానిస్టేబుళ్ల ఆందోళన

నల్గొండ రూరల్ ఎస్సై సైదా బాబు(Nalgonda Rural Scy Saida Babu)ని సస్పెండ్ చేయాలని డిమాండ్ చేస్తూ నల్గొండ జిల్లా అన్నేపర్తి 12వ బెటాలియన్ కానిస్టేబుళ్లు(12th Battalion Constables) ఆందోళన చేపట్టారు.

Update: 2024-10-26 06:53 GMT

దిశ, వెబ్ డెస్క్ : నల్గొండ రూరల్ ఎస్సై సైదా బాబు(Nalgonda Rural Scy Saida Babu)ని సస్పెండ్ చేయాలని డిమాండ్ చేస్తూ నల్గొండ జిల్లా అన్నేపర్తి 12వ బెటాలియన్ కానిస్టేబుళ్లు(12th Battalion Constables) ఆందోళన చేపట్టారు. బెటాలియన్ లో బందోబస్తు కొరకు వెళ్ళిన రూరల్ ఎస్సై సైదా బాబును గో బ్యాక్ అంటూ నినాదాలు చేస్తూ బెటాలియన్ కానిస్టేబుల్స్ మూకుమ్మడిగా ఆయన కారు వైపు దూసుకొచ్చారు. కానిస్టేబుళ్ల ఆందోళన ఉద్రిక్తతకు దారి తీయకుండా ఎస్సై సైదాబాబు అక్కడి నుంచి వెనుతిరిగి వెళ్ళిపోయారు. తమ కుటుంబ సభ్యుల గురించి సైదాబాబు అసభ్యకరంగా మాట్లాడారని బెటాలియన్ కానిస్టేబుళ్ల నిరసనకు దిగారు. అతనిపై చర్యలు తీసుకోని పక్షంలో ఆందోళన కొనసాగిస్తామని హెచ్చరించారు.

కానిస్టేబుళ్ల సెలవులకు సంబంధించి వారి భార్యలు ఆందోళన చేయడంతో ఆరుగురు కానిస్టేబుళ్లను సస్పెండ్ చేసిన ఉన్నతాధికారులు దీనిపై రాష్ట్ర వ్యాప్తంగా విస్తరించిన నిరసనలతో వారిపై సస్పెన్షన్ ఎత్తివేశారు. ఆ వివాదం సద్దుమణిగిందనుకునే లోపునే నల్గొండ రూరల్ ఎస్సై సైదా బాబు వివాదస్పద వ్యాఖ్యలు మరో వివాదాన్ని రగిలించాయి. దీనిపై ఉన్నతాధికారులు స్పందించాల్సిఉంది. 

Tags:    

Similar News