BRS నేతల్లో టెన్షన్.. టెన్షన్.. కవితకు బెయిల్ వచ్చేనా? ఢిల్లీకి బయల్దేరిన KTR-HARISH RAO

ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో ఎమ్మెల్సీ కవిత బెయిల్ పిటిషన్‌పై రేపు (మంగళవారం) సుప్రీంకోర్టు తుది తీర్పును వెలువరించనుంది.

Update: 2024-08-26 11:44 GMT

దిశ, వెబ్‌డెస్క్: ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో ఎమ్మెల్సీ కవిత బెయిల్ పిటిషన్‌పై రేపు (మంగళవారం) సుప్రీంకోర్టు తుది తీర్పును వెలువరించనుంది. కవిత బెయిల్ పిటిషన్‌పై సుప్రీంకోర్టులో విచారణ ఉండటంతో మాజీ మంత్రి హరీష్ రావు అండ్ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ 20 మంది ఎమ్మెల్యేలతో ఢిల్లీకి పయనమవుతున్నారన్న విషయం తెలిసిందే. కాగా తాజాగా (సోమవారం) కేటీఆర్, హరీష్ రావు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, పార్టీ కీలక నేతలతో కలిసి ఢిల్లీకి బయల్దేరారు.

ఇక ఎమ్మెల్సీ కవితకు జులై 1 వ తారీకు బెయిల్‌ ఇచ్చేందుకు కోర్టు నిరాకరించింది. దీంతో కవిత దాన్ని సవాల్ చేస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. దీంతో విచారణ చేపట్టిన కోర్టు ఆగస్టు 27 న కు వాయిదా వేసింది. కాగా రేపు (మంగళవారం) కవితకు బెయిల్ వస్తుందా? లేదా? అనేదానిపై బీఆర్ఎస్ నేతల్లో ఆందోళన నెలకొంది. బెయిల్ వస్తుందో లేదో రేపటి వరకు ఎదురు చూడాల్సిందే.


Similar News