గొర్రెల ఉత్పత్తిలో తెలంగాణ మొదటి స్థానం

రాష్ట్రంలో గొర్రెల పంపిణీ విధానంలో, గొర్రెల జనాభా, మాంసం ఉత్పత్తిలో దేశంలోనే తెలంగాణ మొదటి స్థానంలో ఉందని

Update: 2023-02-17 13:53 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలో గొర్రెల పంపిణీ విధానంలో, గొర్రెల జనాభా, మాంసం ఉత్పత్తిలో దేశంలోనే తెలంగాణ మొదటి స్థానంలో ఉందని ఆ రాష్ట్ర షీప్ అండ్ గోట్ డెవలప్మెంట్ ఫెడరేషన్ చైర్మన్ డాక్టర్ దూదిమెట్ల బాలరాజు వెల్లడించారు. శుక్రవారం కోటిలోని గోల్డెన్ జూబ్లీ హాల్ ఎస్‌బీఐ హెడ్ ఆఫీస్‌లో జరిగిన రాష్ట్ర స్థాయి వివిధ బ్యాంకు అధికారులతో సమావేశం నిర్వహిచారు.

ముఖ్యమంత్రి కేసీఆర్,మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మార్గదర్శకంలో గొర్రెల పంపిణీ అమలవుతుందని చెప్పారు. ఎన్ఎల్ఎం స్కీంతో నిరుద్యోగ యువతకు సహకారం అందించడంపై బ్యాంకు అధికారులతో చర్చించామన్నారు. ఈ మీటింగ్‌లో భాగస్వామ్యం చేసిన ఆర్దిక మంత్రి హరీశ్ రావుకి, ఆర్థిక శాఖ సెక్రటరీకి, అధికారులకు ధన్యవాదాలు బాలరాజు తెలియజేశారు.

Also Read..

ఏడుపాయల జాతర నేపథ్యమేంటి..? ఈ జాతరను ఎప్పటి నుంచి జరుపుతున్నారు..??

Tags:    

Similar News