CM Revanth Reddy : పరిశ్రమల స్థాపనకు తెలంగాణ సరైన ఎంపిక : సీఎం రేవంత్ రెడ్డి

పరిశ్రమల(Industries Establishment) స్థాపనకు తెలంగాణ రాష్ట్రం(Telangana State) సరైన ఎంపిక(Right Choice)అని సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy)అన్నారు. హైదరాబాద్ హైటెక్ సిటీ సీఐఐ గ్రీన్ బిజినెస్ సెంటర్ లో సీఐఐ జాతీయ కౌన్సిల్(CII National Council)సమావేశాన్ని సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించా(started)రు.

Update: 2025-01-10 06:08 GMT

దిశ, వెబ్ డెస్క్ : పరిశ్రమల(Industries Establishment) స్థాపనకు తెలంగాణ రాష్ట్రం(Telangana State) సరైన ఎంపిక(Right Choice)అని సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy)అన్నారు. హైదరాబాద్ హైటెక్ సిటీ సీఐఐ గ్రీన్ బిజినెస్ సెంటర్ లో సీఐఐ జాతీయ కౌన్సిల్(CII National Council)సమావేశాన్ని సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించా(started)రు. ఈ సందర్భంగా గ్రీన్ బిజినెస్ సెంటర్ లో రేవంత్ రెడ్డి మొక్క నాటారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఫోర్త్ సిటీని ప్రపంచ స్థాయి నగరంగా నిర్మించబోతుందన్నారు. కాలుష్య నివారణకు 3,200వేల ఈవీ బస్సులు తెచ్చామని, ఈవీ వాహానాలకు రోడ్డు టాక్స్, రిజిస్ట్రేషన్ పన్నులను మినహాయించామన్నారు.

గ్రీన్ ఎనర్జీని ప్రోత్సహిస్తూ సోలార్ విద్యుత్ ఉత్పత్తిని ప్రోత్సహిస్తున్నామన్నారు. హైదరాబాద్ లో, 55కిలోమీటర్ల మూసీ నది పునరుజ్జీవన కార్యక్రమాన్ని చేపట్టామని, 2050ప్రణాళికతో మంచినీటి వసతి ఏర్పాటు చేస్తున్నామన్నారు. 360కిలోమీటర్ల రీజీనల్ రింగ్ రోడ్డు నిర్మాణం, ఓఆర్ఆర్, త్రిఫుల్ ఆర్ మధ్య రేడియల్ , లింకు రోడ్ల నిర్మాణంజరుగుతుందన్నారు. రింగ్ రైల్వే ప్రతిపాదనల్లో ఉందన్నారు. మెట్రో రైలును విస్తరిస్తున్నామన్నారు. ఓఆర్ఆర్, త్రిఫుల్ ఆర్ మధ్య పారిశ్రామిక మండళ్లకు మంచి అవకాశముందన్నారు. ఓఆర్ఆర్ ఆవలివైపు గ్రామీణ తెలంగాణ అభివృద్ధికి సంబంధిత పరిశ్రమలను ప్రోత్సహిస్తున్నామన్నారు. చైనా తరహాలో పారిశ్రామిక క్లసర్లకు మౌలిక సదుపాయాలు కల్పిస్తామన్నారు.

తెలంగాణ ప్రగతికి డ్రై పోర్టు నిర్మాణానికి యోచిస్తున్నామన్నారు. పారిశ్రామిక వేత్తలు తెలంగాణలో పారిశ్రామికాభివృద్ధికి ప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సాహాకాలను అందిపుచ్చుకుని భారీగా పెట్టుబడులు, పరిశ్రమలకు ముందుకురావాలన్నారు. మీ భాగస్వామ్యంతో తెలంగాణ దేశంలోనే పారిశ్రామిక ప్రగతిలో నెంబర్ వన్ గా ఎదగే అవకాశముందన్నారు. తెలంగాణ రైజింగ్ 2050లక్ష్యం దిశగా ముందడుగు వేస్తుందన్నారు.

ఈ సందర్భంగా పలువురు పారిశ్రామిక వేత్తలు అడిగిన ప్రశ్నలకు సీఎం రేవంత్ రెడ్డి సమాధానాలిచ్చారు. మహిళాభివృద్ధికి చేపట్టిన చర్యలను, గ్రామీణ ఆర్థిక వనరులు, పారిశ్రామిక మౌలిక వసతుల కల్పన చర్యలను వివరించారు. లాజిస్టిక్ జోన్ అంశాలపై మాట్లాడారు. రోడ్డు, రైల్వే, ఎయిరో పోర్టు వసతులను వివరించారు. ఆటోమొబైల్ ఇండస్ట్రీల విస్తరణ ఆవశ్యకతలను, ఈ రంగంలో  పభుత్వ ప్రాధాన్యతలను వివరించారు. రాష్ట్రంలో మానవ వనరులు, విద్యా, వృత్తి నిపుణుల లభ్యత, యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ, ఐటీఐల ఆధునీకరణ అంశాలను పారిశ్రామిక వేత్తలకు విశదీకరించారు. సమావేశంలో సీఐఐ ప్రతినిధులు సంజీవ్ పూరి, ఆర్. ముకుందన్, డీజీ బెనర్జీ లు పాల్గొన్నారు.  

Tags:    

Similar News