తెలంగాణ బీజేపీ టీచర్స్ MLC అభ్యర్థుల ప్రకటన
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల(Graduate MLC Election) వేళ తెలంగాణ బీజేపీ(Telangana BJP) అధిష్టానం దూకుడు పెంచింది.
దిశ, వెబ్‌డెస్క్: గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల(Graduate MLC Election) వేళ తెలంగాణ బీజేపీ(Telangana BJP) అధిష్టానం దూకుడు పెంచింది. అన్ని పార్టీల కంటే ముందే మూడు స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది. ఈ మేరకు శుక్రవారం రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి(Kishan Reddy) జాబితా విడుదల చేశారు. నల్గొండ-ఖమ్మం-వరంగల్ టీచర్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా సరోత్తం రెడ్డి, కరీంనగర్-మెదక్-ఆదిలాబాద్-నిజామాబాద్ టీచర్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా మల్కా కొమరయ్య, కరీంనగర్-మెదక్-ఆదిలాబాద్-నిజామాబాద్ గ్రాడ్యుయేట్ అభ్యర్థిగా అంజిరెడ్డిని ప్రకటించారు. బీజేపీ జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డా ఆదేశాలతో కిషన్‌రెడ్డి అభ్యర్థులను ప్రకటించారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో బీజేపీ అధిష్టానం అప్రమత్తమైంది. మరోవైపు 12 జిల్లాల నుంచి ఓటు హక్కు కోసం మొత్తం 28వేల మందికి పైగా ఉపాధ్యాయులు, అధ్యాపకులు దరఖాస్తు చేసుకోగా, పరిశీలన అనంతరం మొత్తం 22,554 మంది ఓటర్లతో ముసాయిదా ఓటర్ల జాబితాను ఫైనల్ చేశారు.