మళ్లీ ఆ మాట అంటే పళ్లు రాలగొడతాం.. రేవంత్ స్ట్రాంగ్ వార్నింగ్

తెలంగాణలో బీఆర్ఎస్ ప్రభుత్వం త్వరలో వస్తుందన్న ఆ పార్టీ నాయకులకు సీఎం రేవంత్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు...

Update: 2024-02-02 12:10 GMT

దిశ, వెబ్ డెస్క్: తెలంగాణలో ఇటీవల జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. బీఆర్ఎస్ పార్టీ ప్రతిపక్షంలోకి వెళ్లింది. అయితే కాంగ్రెస్ ప్రభుత్వం త్వరలో పడిపోతుందని.. బీఆర్ఎస్ ప్రభుత్వం వస్తుందని కారు పార్టీ నాయకులు అంటున్నారు. అయితే ఈ వ్యాఖ్యలకు సీఎం రేవంత్ రెడ్డి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చే దమ్ముందా అని ఆయన ప్రశ్నించారు. ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లిలో పర్యటించిన ఆయన బీఆర్ఎస్ నేతలపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. మూడు నెలలకో, ఆరు నెలలకో కేసీఆర్ సీఎం అవుతారని ఎవడైనా అంటే పళ్లు రాలగోడతామని హెచ్చరించారు. ఆ ఇంటి మీద పిట్టే ఈ ఇంటి మీద వాలితే కాల్చి పడేస్తామని బీఆర్ఎస్ జంపింగ్ జిలానీలను ఉద్దేశించి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. దేశంలో రెండే రెండు కూటములు ఉంటాయని.. ఒకటి మోడీ కూటమి అని, మరొకటి ఇండియా కూటమి అని రేవంత్ వ్యాఖ్యానించారు. కానీ తమ కూటమిలోకి మాత్రం కేసీఆర్‌ను రానివ్వమని తేల్చి చెప్పారు. బీజేపీకి గానీ, బీఆర్ఎస్ గానీ 6 నుంచి 7 ఎంపీ సీట్లు వస్తే రాష్ట్రాన్ని మళ్లీ మోడీకి అమ్ముకుంటారని రేవంత్ జోస్యం చెప్పారు. మోదీ ఎవరి ఖాతాలోనైనా 15 లక్షలు వేశారా అని రేవంత్ ప్రశ్నించారు. 

Tags:    

Similar News