Telangana Cabinet : జనవరి 4న తెలంగాణ కేబినెట్ సమావేశం

తెలంగాణ కేబినెట్(Telangana Cabinet Meeting) సమావేశం జనవరి 4వ(January 4th)తేదీన సాయంత్రం 4గంటలకు సచివాలయంలో సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy)అధ్యక్షతన జరుగనుంది.

Update: 2024-12-31 09:58 GMT

దిశ, వెబ్ డెస్క్ : తెలంగాణ కేబినెట్(Telangana Cabinet Meeting) సమావేశం జనవరి 4వ(January 4th)తేదీన సాయంత్రం 4గంటలకు సచివాలయంలో సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy)అధ్యక్షతన జరుగనుంది. సమావేశంలో రైతు భరోసా, భూమిలేని నిరుపేదలకు ఏడాదికి రూ.12 వేలు ఆర్థిక సహాయం, కొత్త రేషన్ కార్డులు, ఎస్సీ వర్గీకరణ, స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్ల కోసం డెడికేటెడ్ కమిషన్ నివేదిక, యాదగిరిగుట్ట ఆలయ బోర్డు ఏర్పాటు సహా పలు కీలక అంశాలపై చర్చించే అవకాశం ఉంది.

సంక్రాంతి నుంచే రైతుభరోసా పథకం అమలు చేస్తామని ప్రభుత్వం ఇటీవల అసెంబ్లీలో ప్రకటించింది. ఈ నేపథ్యంలో రైతుభరోసా ఎవరికి ఇవ్వాలన్న దానితో పాటు కొత్త రేషన్‌ కార్డుల జారీకి మార్గదర్శకాల ఖరారుపై సమావేశంలో చర్చించి కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశముంది. వ్యవసాయ యాంత్రీకరణ, వీఆర్వో వ్యవస్థ, భూభారతి అమలు వంటి అంశాలపై కూడా చర్చించనున్నట్లుగా సమాచారం. 

Tags:    

Similar News