ABVP: ఉన్నత విద్యా మండలి కార్యాయం ఎదుట ఉద్రిక్తత.. ఏబీవీపీ మెరుపు ముట్టడి
తెలంగాణ ఉన్నత విద్యా మండలి (Telangana Council of Higher Education) కార్యాలయం ఎదుట ఇవాళ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ ఉన్నత విద్యా మండలి (Telangana Council of Higher Education) కార్యాలయం ఎదుట ఇవాళ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. గురుకులాలు, ప్రభుత్వ వసతి గృహాల్లో మౌలిక వసతులు కల్పించాలని డిమాండ్ చేస్తూ ఏబీవీపీ (ABVP) ఆధ్వర్యంలో ఉన్నత విద్యా మండలి కార్యాలయ ముట్టడికి పిలుపునిచ్చారు. ఈ క్రమంలోనే విద్యార్థులు అక్కడి చేరుకుని కార్యాలయం లోనికి వెళ్లేందుకు తీవ్రంగా ప్రయత్నించారు. దీంతో అక్కడే ఉన్న పోలీసులు అప్రమత్తమై వారికి అడ్డుకున్నారు. ఈ క్రమంలో శాంతియుతంగా నిరసన వ్యక్తం చేసే హక్కు కూడా తమకు లేదా అని విద్యార్థులు, పోలీసులను ప్రశ్నిస్తూ.. వాగ్వాదానికి దిగారు. ప్రస్తుతం ఉన్నత విద్యా మండలి కార్యాలయం గేట్లను పోలీసులు మూసి వేసి విద్యార్థులను అక్కడి నుంచి చెదరగొడుతున్నారు.