Octopus Commanders : ఆక్టోపస్ కమాండర్ల పాసింగ్ అవుట్ పరేడ్
రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలో ఆక్టోపస్ కమాండో(Octopus Commanders)ల పాసింగ్ అవుట్ పరేడ్(Passing out Parade) అట్టహాసంగా నిర్వహించారు.
దిశ, వెబ్ డెస్క్ : రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలో ఆక్టోపస్ కమాండో(Octopus Commanders)ల పాసింగ్ అవుట్ పరేడ్(Passing out Parade) అట్టహాసంగా నిర్వహించారు. పరేడ్ ముఖ్య అతిధిగా హాజరైన ఇంటెలిజెన్స్ డీజీపీ శివధర్ రెడ్డి(Intelligence DGP Shivdhar Reddy) కమాండోల సెల్యూట్ ను స్వీకరించి మాట్లాడారు. సైబర్ క్రైం, ఆర్థిక నేరాలు, ఉగ్రవాద నిర్మూలనకు సంవర్ధవంతంగా పని చేయాలని సూచించారు. నేర పరిశోధనల్లో సాంకేతికతను జోడించి నేరాల ఆదుపు, నిందితులకు శిక్షలు పడేలా చేయడంలో సత్ఫలితాలు సాధించేలా ప్రయత్నించాలన్నారు. పాసింగ్ అవుట్ పరేడ్ సందర్భంగా ఆక్టోపస్ కమాండోల ప్రదర్శించిన విన్యాసాలు ఆకట్టుకున్నాయి.
మరోవైపు యూసఫ్ గూడలోని బెటాలియన్ లో శిక్షణ పూర్తి చేసుకున్న 549 కానిస్టేబుళ్ల పాసింట్ అవుట్ పరేడ్ ఘనంగా సాగింది. డీజీపీ జితేందర్(DGP Jitender) ముఖ్య అతిధిగా హాజరై మాట్లాడుతూ అంతర్జాతీయ స్థాయి పోలీస్ క్రీడాకారులను తయారు చేసేందుకు ప్రత్యేక ట్రైనింగ్ సెంటర్లను ఏర్పాటు చేయబోతున్నామని తెలిపారు. టీజీఎస్పీలో చేరిన క్రీడాకారులు నిఖత్ జరీన్, మహ్మద్ సిరాజ్ లను శిక్షణకు వినియోగిస్తామని తెలిపారు.