బీఆర్ఎస్, బీజేపీ కలిసి పని చేస్తున్నాయి.. రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇంచార్జ్ మాణిక్ రావు ఠాక్రే

బీఆర్ఎస్, బీజేపీ కలిసి పని చేస్తున్నాయని రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇంచార్జ్ మాణిక్ రావు ఠాక్రే ఆరోపించారు.

Update: 2023-08-06 08:48 GMT

దిశ, వెబ్ డెస్క్: బీఆర్ఎస్, బీజేపీ కలిసి పని చేస్తున్నాయని రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇంచార్జ్ మాణిక్ రావు ఠాక్రే ఆరోపించారు. ఓటర్ల జాబితా అవగాహన సదస్సులో ఆయన పాల్గొని మాట్లాడారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్, బీజేపీలపై విరుచుకుపడ్డారు. బీజేపీ, బీఆర్ఎస్ రెండూ ఒక్కటేనని అన్నారు. బయటకు మాత్రం శత్రువులుగా వ్యవహరిస్తున్నారు గానీ ఢిల్లీలో మాత్రం బీఆర్ఎస్ పార్టీ బీజేపీకి సహకారం అందిస్తోందని అన్నారు. కేసీఆర్ ఓట్ల కోసం ప్రజలకు హామీలు ఇస్తున్నారు తప్ప ప్రజల కోసం కాదని, రాష్ట్రంలో ఒక్క కేసీఆర్ కుటుంబం మాత్రమే బాగుపడిందని అన్నారు. రాష్ట్ర ప్రజలను దోచుకొని మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ లో కేసీఆర్ రాజకీయాలు చేస్తున్నారని విమర్శించారు. రాష్ట్ర ప్రజల ఆకాంక్షలను గౌరవించి సోనియాగాంధీ తెలంగాణ రాష్ట్రాన్ని ఇస్తే.. కేసీఆర్ మాత్రం రాష్ట్రాన్ని అప్పులపాలు చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ కు బుద్ధి చెప్పి కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టాలని ప్రజలను కోరారు. ఎన్నికల సమయంలో బూత్ లెవెల్ ఏజెంట్ల నియామకం చాలా కీలకంగా భావించాలని, బీఎల్ఏ లకు ఎన్నికల కమిషన్ ను అడిగే హక్కు ఉంటుందని అన్నారు. ఎన్నికల సమయంలో అధికార పార్టీ చేసే అక్రమాలను నివరించాలని, ఈ ఎన్నికలను కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు చాలా ముఖ్యంగా భావించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ప్రచార కమిటీ చైర్మన్ మధు యాష్కీ, మాజీ పీసీసీ అధ్యక్షులు వి.హనుమంతరావు తదితరులు పాల్గొన్నారు.

Tags:    

Similar News