బీఆర్ఎస్ ఓటమిపై సుఖేష్ చంద్రశేఖర్ సంచలన లేఖ..
మనీ లాండరింగ్ కేసులో నిందితునిగా ఉన్న సుఖేష్ చంద్రశేఖర్ తిహార్ జైలు నుంచి లెటర్లు విడుదల చేసే పర్వాన్ని కంటిన్యూ చేస్తూన్నారు.
దిశ, డైనమిక్ బ్యూరో: మనీ లాండరింగ్ కేసులో నిందితునిగా ఉన్న సుఖేష్ చంద్రశేఖర్ తిహార్ జైలు నుంచి లెటర్లు విడుదల చేసే పర్వాన్ని కంటిన్యూ చేస్తూన్నారు. బీఆర్ఎస్ పార్టీ, కేటీఆర్, కవితను టార్గెట్గా ఇటీవల వరుసగా సుఖేష్ చంద్రశేఖర్ లేఖలు రూస్తూనే ఉన్నారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్లో కవిత, కేటీఆర్ పై తీవ్ర ఆరోపలు చేశారు. ఈ విషయంలో కేటీఆర్ వర్సెస్, సుఖేష్ మధ్య సవాళ్ల పర్వం నడిచిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో తాజాగా సుఖేష్ మరోసారి కేటీఆర్, కవితను టార్గెట్ చేస్తూ మరో లేఖను విడుదల చేయడం సంచలనంగా మారింది. డియర్ కేటీఆర్ బ్రదర్.. కె.కవిత అక్కయ్య అని పదే పదే సంబోధిస్తూ జైలు నుంచి తన అడ్వకేట్ ద్వారా పంపిన లేఖ రాజకీయ వర్గాల్లో ఆసక్తిగా మారింది.
నేను చెప్పిందే జరిగింది:
'డియర్ కేటీఆర్ బ్రదర్, కె.కవిత అక్కయ్య.. మొదట అసెంబ్లీ ఎన్నికల్లో మీరు సాధించిన ఫలితాలకు నేను మిమ్మల్ని అభినందిస్తున్నారు. మీ అబద్ధాలు, మీ అత్యాశలు, మీ అవినీతి నా తెలుగు ప్రజలందరికి అర్థమైనట్లే మీ అహంకారం, బూటకపు పరాక్రమాలు అన్ని అంతం అవుతాయని నేను కొన్ని నెలల క్రితం నా పత్రికా ప్రకటనల్లో చెప్పిన విషయం మీకు గుర్తు ఉండే ఉంటుంది. మీ విషయం తెలిసిన తెలుగు ప్రజలు మీకు ఈ రకమైన తీర్పు ఇచ్చారు. మీకు ఇచ్చిన సంపూర్ణ అధికారాన్ని పూర్తిగా భ్రష్టు పట్టించారు. మీ అవినీతిని అహంకారాన్ని అందరూ అర్థం చేసుకున్నారు. మీరు నన్ను మోసగాడు అని పిలిచారు. కానీ ఇవాళ మీరు అదే స్థానానికి వచ్చారు. ఇప్పుడు మీకు నాకు పెద్దగా తేడా లేదు. మీ అవినీతి విషయంలో నిజాయితీని నిరూపించుకునేందుకు మీరంతా సిద్ధంగా ఉండండి. త్వరలోనే మీరు మీ భాగస్వాములైన కట్టర్ అవినీతి ఆమ్ ఆద్మీ పార్టీ నాయకులతో జైలు క్లబ్ లో చేరుతారు.
అలాగే త్వరలోనే మీరు మీకు ఇష్టమైన ఇల్లు కలిగిన 'అమెరికా' దేశానికి వెళ్లిపోతారని నేను కచ్చితంగా అనుకుంటున్నాన్నారు. మీ వాస్తవాలన్ని త్వరలోనే బహిర్గతం అవుతాయని ఇందుకు కౌంట్ డౌన్ మొదలైందన్నారు. ఓటు వేసే ఈ గొప్ప దేశంలో చట్టం, సామాన్యుడి కంటే ఎవరూ శక్తివంతమైన వారు కాదని కాబట్టి మీరు చట్టాన్ని ఎదుర్కొవాలని నేను కోరుకుంటున్నాను. ఫలితాల రోజు ఎక్స్ (ట్విట్టర్) లో తుపాకీ పట్టుకుని 3.0 అని మీరు పోస్ట్ చేయడం నేను చూశారు. కానీ నిజాయితీగా అంచనా వేస్తే మిమ్మల్ని మీరు ఫూల్ అవుట్ చేయాలనుకున్నారు. మీరు చెబుతున్న 3.0 ‘జైలు సమయం’ త్వరలోనే జరుగుతుంది. అంతకు మించి ఏమీ లేదు కేటీఆర్ బ్రదర్. చివరగా కామారెడ్డిలో నిజమైన స్టార్ కిల్లర్ మీరే కేటీఆర్ అన్న. స్లేయర్ గ్రాండ్ విక్టరీకి నేను కేటీఆర్ అన్నకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ అన్నకు అభినందనలు' అంటూ లేఖలో రాసుకొచ్చారు.
అన్నా చెల్లెలిని వదలని సుఖేష్:
ఢిల్లీ లిక్కర్ స్కామ్లో తొలుత ఆమ్ ఆద్మీ పార్టీ నేతలపై సంచలన ఆరోపణలు చేసిన సుకేష్ చంద్రశేఖర్ ఆ తర్వాత బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత, మాజీ మంత్రి కేటీఆర్ పై తీవ్ర ఆరోపణలు చేశారు. తన వద్ద ఉన్న ఆధారాలు ఇవ్వాలని కవిత, కేటీఆర్ సన్నిహితులు తనపై ఒత్తిడి చేస్తున్నారని ఆరోపించారు. ఈ విషయంలో సుఖేష్ ఏకంగా కేంద్ర హోం మంత్రి అమిత్ షా, తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ కు లేఖలు రాయడం గతంలో పొలిటికల్ దుమారం రేపింది.ఆధారాలు ఇస్తే రూ.100 కోట్ల నగదు, శంషాబాద్ వద్ద భూమి, అసెంబ్లీ సీటు ఇస్తామని ఆశపెడుతున్నారని గవర్నర్ కు రాసిన లేఖలో సుఖేష్ పేర్కొన్నారు. తాను గవర్నర్ కు ఫిర్యాదు చేసినందకే తన అనుచరులతో కేటీఆర్ బెదిరింపులకు పాల్పడుతున్నారని సుకేశ్ ఆరోపించగా సుకేష్ కు కేటీఆర్ లీగల్ నోటీసులు పంపించారు. బహిరంగ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. అయితే కేటీఆర్ లీగల్ నోటీసులపై వెనక్కి తగ్గని సుకేష్ ఆ తర్వాత కూడా అదే పంథాలో వారిని టార్గెట్ చేస్తున్నాడు. ఈ క్రమంలో మరోసారి లేఖ రాయడం సంచలనం అవుతున్నది.