DK Aruna: ఏపీ అభివృద్ధిపై మహబూబ్‌నగర్ ఎంపీ సంచలన వ్యాఖ్యలు

ఆంధ్రప్రదేశ్ లో చంద్రబాబు(CM Chandrababu) సీఎంగా మంచి అభివృద్ధి(Developement) చేస్తున్నారని మహబూబ్ నగర్(MahaboobNagar) బీజేపీ ఎంపీ డీకే అరుణ(MP DK Aruna) అన్నారు.

Update: 2025-01-03 13:43 GMT

దిశ, వెబ్ డెస్క్: ఆంధ్రప్రదేశ్ లో చంద్రబాబు(CM Chandrababu) సీఎంగా మంచి అభివృద్ధి(Developement) చేస్తున్నారని మహబూబ్ నగర్(MahaboobNagar) బీజేపీ ఎంపీ డీకే అరుణ(MP DK Aruna) అన్నారు. శుక్రవారం కుటుంబంతో పాటు ఇంద్రకీలాద్రిపై దుర్గమ్మను దర్శించుకున్న ఆమె.. ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ.. కనకదుర్గ ఆలయంలో చాలా మార్పులు జరిగాయని, చాలా అభివృద్ధి జరిగిందని తెలిపారు. దర్శనానికి చాలా మంచి ఏర్పాటు చేశారని, గతంలో కంటే మంచి దర్శనం జరిగిందని అన్నారు. అమ్మవారు ప్రజలను చల్లగా చూడాలని, రెండు తెలుగు రాష్ట్రాలు సస్యశామలంగా ఉండాలని కోరుకున్నట్లు చెప్పారు. రెండు ప్రాంతాల ప్రజలు కలిసి అభివృద్ధి దిశగా ముందుకు వెళ్లాలని ఆశించారు. అలాగే కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో సీఎం చంద్రబాబు మంచి అభివృద్ధి చేస్తున్నారని, ఈ ప్రాంతం మరింత ముందుకు వెళ్లాలని కోరుకుంటున్నానని డీకే అరుణ ఆకాంక్షించారు.

Tags:    

Similar News