Shamshabad Airport: ఇద్దరు కస్టమ్స్ అధికారులపై CBI కేసు
రంగారెడ్డి జిల్లా శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం(Shamshabad Airport)లో పనిచేస్తున్న ఇద్దరు కస్టమ్స్ అధికారుల(Customs Officials)పై ఏసీబీ కేసు(ACB Case) నమోదు చేసింది.
దిశ, వెబ్‌డెస్క్: రంగారెడ్డి జిల్లా శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం(Shamshabad Airport)లో పనిచేస్తున్న ఇద్దరు కస్టమ్స్ అధికారుల(Customs Officials)పై సీబీఐ కేసు(CBI Case) నమోదు చేసింది. ప్రయాణికుడి నుంచి రూ.50 వేలు లంచం తీసుకున్నట్లు ఆరోపణలు రావడంతో కేసు నమోదు చేసిన సీబీఐ అధికారులు దర్యాప్తు ప్రారంభించారు. శుక్రవారం సదరు అధికారుల ఇళ్లు, కార్యాలయాల్లో తనిఖీలు చేసి.. రూ.4.76 లక్షల స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడ్డ అధికారులు వినయ్ కుమార్(Vinay Kumar), ముఖేశ్ కుమార్(Mukesh Kumar)లుగా గుర్తించారు.
వీరితో పాటు సహకరించిన కెనరా బ్యాంక్ అధికారి సంతోష్ కుమార్‌పైనా కేసు నమోదు చేశారు. ఇదిలా ఉండగా.. ఇటీవల కాలంలో ప్రజలను మోసగించేందుకు మోసగాళ్లు సరికొత్త దారులను వెతుక్కుంటున్నారు. ముఖ్యంగా ఏదైనా అవసరంతో ఇతరులకు పార్శిల్స్ చేసిన వారిని లక్ష్యంగా చేసుకుని కస్టమ్స్ అధికారులను మచ్చిక చేసుకొని మోసాలకు పాల్పడటం, అక్రమ రవాణా వంటివి చేస్తున్నారు. దీంతో కస్టమ్స్ అధికారులకు కూడా ఉన్నతాధికారులు హెచ్చరికలు చేశారు.