అనుమానాస్పదంగా వ్యక్తి మృతి
రామడుగు మండలం గుండి గ్రామంలో అనుమానాస్పదంగా వృద్ధుడు మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు.
దిశ, రామడుగు : రామడుగు మండలం గుండి గ్రామంలో అనుమానాస్పదంగా వృద్ధుడు మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు. ఈ సందర్భంగా స్థానికులు అందించిన వివరాల మేరకు గంగాధర మండలం సర్వ రెడ్డి పల్లె గ్రామానికి చెందిన ముద్దం లక్ష్మయ్య అనే వ్యక్తి రామడుగు మండలం గుండి గ్రామానికి చెందిన మేకల రాములు వద్ద జీతంగా కొద్ది సంవత్సరాల నుండి పనిచేస్తున్నట్లు తెలిసింది. కాగా ఆదివారం పనిచేసే చోట విగతజీవిగా పడి ఉండగా స్థానికులకు సమాచారం అందడంతో హాస్పిటల్కు తరలించినట్టు తెలిపారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.