కోడి పందేల నిర్వాహకుల అరెస్ట్
మండల పరిధిలోని రామాపురం గ్రామ శివారులో ఆదివారం కోడి పందేలను నిర్వహిస్తున్నారన్న సమాచారం తెలుసుకున్న ఎస్సై పి.వెంకటేష్ తన సిబ్బంది తో కలిసి మెరుపు దాడి చేశారు.
దిశ, ఎర్రుపాలెం : మండల పరిధిలోని రామాపురం గ్రామ శివారులో ఆదివారం కోడి పందేలను నిర్వహిస్తున్నారన్న సమాచారం తెలుసుకున్న ఎస్సై పి.వెంకటేష్ తన సిబ్బంది తో కలిసి మెరుపు దాడి చేశారు. ఏడుగురు నిందితులను, ఏడు మొబైల్ ఫోన్లను, రెండు కోడి పుంజులను, ఎనిమిది వేల ఆరువందల అరవై రూపాయల నగదును, ఆరు బైక్ లను సీజ్ చేసి నిర్వాహకులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.